Begin typing your search above and press return to search.
ఎన్.టి.ఆర్.. విడగొట్టక తప్పదా?
By: Tupaki Desk | 2 April 2018 4:46 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా.. తేజ దర్శకత్వంలో దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాధను.. ఎన్.టి.ఆర్. అనే పేరుతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. వన్ డే షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది.
అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ ను ఒకే సినిమాగా రూపొందించండం చాలా కష్టం అని భావిస్తున్నారట. రెండు భాగాలు చేయక తప్పదనే అభిప్రాయాన్ని వెల్లడించాడట దర్శకుడు తేజ. ఇదే విషయాన్ని అటు హీరోతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. మూవీ యూనిట్ కు కూడా చెప్పేశాడని తెలుస్తోంది. బాలయ్య నుంచి ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉందని అంటున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించిన రోజున.. ఈ కథలో.. కథ కూడా కాదు ఈ చరిత్రలో ఆరు సినిమాలకు సరిపడేంతటి కథ ఉందని.. ఈ మొత్తాన్ని ఒక సినిమాగా తీయడం చాలా చాలా కష్టం అని అన్నాడు తేజ.
ఇదే విషయాన్ని కాసింత సున్నితంగా బాలయ్యకు కూడా వివరించిన తేజ.. ఎన్టీఆర్ ను రెండు పార్టులుగా తీసేందుకు అంగీకరింపచేశాడని అంటున్నారు. సెప్టెంబర్ నాటికే సినిమాను తెచ్చే యోచన వెనుక కూడా ఈ రెండు భాగాల ఆలోచన ఉండడమే కారణంగా చెబుతున్నారు. తొలి భాగాన్ని దసరాకి.. రెండో భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి విడుదల చేయాలని భావిస్తున్నారట.