Begin typing your search above and press return to search.
ఎన్ టీఆర్ పోస్టర్ లో ఇద్దరు చంద్రులేరి?
By: Tupaki Desk | 28 March 2018 7:37 AM GMTనందమూరి తారక రాముడి జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా ‘ఎన్ టీఆర్’. తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం మార్చి 29న బాలయ్యకి సెంటిమెంట్ అయిన నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్ లో జరగనుంది. అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ పోస్టర్‌లో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరు మాత్రమే ఉంది. అయితే చిత్ర వేడుకకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబునాయుడు వస్తారని ప్రచారం జరిగింది. ఓ సినీ వేడుకలో ఇద్దరు చంద్రులూ కనిపించబోతున్నారంటే అది చాలా పెద్ద విశేషమే. రాజకీయాలను పక్కన పెట్టి కలివిడిగా తిరుగుతారని తెలుగు ప్రజలంతా ఊహించారు. కాని తాజా పోస్టర్‌లో ఆ ఇద్దరి పేర్లూ లేవు. అంటే ఇన్ని రోజులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని చేసిందంతా కేవలం రూమర్లేనా... లేక ప్రచార ఆర్భాటమా! అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ బాలయ్య కోరిన ఇద్దరు చంద్రలు వేరే కారణాల వల్ల రాలేమని చెప్పేశారో తెలీదు.
ఏదైతేనేం ఈ ప్రారంభ వేడుకలో బాలయ్య పక్కన వెంకయ్య నాయుడు మాత్రమే మెరవబోతున్నాడు. బాల్యం నుంచి హీరోగా - తర్వాత తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా - తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదిగేదాకా తారక రాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాడు బాలయ్యబాబు.