Begin typing your search above and press return to search.
పెద్ద ప్రమాదాలు తప్పాయంటున్న బాలయ్య
By: Tupaki Desk | 26 Dec 2016 7:30 AM GMTషూటింగ్ సమయంలో నందమూరి బాలకృష్ణ సాహసాల గురించి చాలామంది దర్శకులు.. ఫైట్ మాస్టర్లు గొప్పగా చెబుతుంటారు. ‘లెజెండ్’ సినిమా షూటింగ్ సందర్భంగా చేసిన కొన్ని రియల్ స్టంట్ల గురించి దర్శకుడు బోయపాటి శ్రీను ఆ మధ్య ప్రస్తావించాడు. ఐతే ఇప్పటిదాకా బాలయ్య తన సినిమాల కోసం పడ్డ కష్టం ఒకెత్తు. తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం పడ్డ కష్టం మరో ఎత్తు అని దర్శకుడు క్రిష్ తో పాటు యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య రేయింబవళ్లు కష్టపడ్డాడని.. గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుని.. అనేక సాహసోపేత విన్యాసాలు చేశాడని క్రిష్ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా బాలయ్య ఒకటికి రెండుసార్లు గుర్రం మీది నుంచి కింద పడ్డాడట కూడా.
ఈ సినిమా కోసం పెట్టిన శ్రద్ధ.. పడ్డ కష్టం గురించి బాలయ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘‘శాతకర్ణి పాత్ర కోసం నేను అనేక జాగ్రత్తలు తీసుకున్నా. షూటింగ్ జరుగుతున్నంత కాలం.. బరువు పెరుగుతానని వరి అన్నం తినడం మానేశా. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడిని. పాత్ర కోసం వేసుకున్న దుస్తులు.. ఆభరణాలు కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేశాం. ఆ సమయంలో రాజులు ఎలా ఉండేవారనే విషయంపై చారిత్రక ఆధారాలు ఎక్కువగా లేవు. అక్కడక్కడ దొరికిన శాసనాలు.. బొమ్మల ఆధారంగా వీటిని డిజైన్ చేయించాం. ఈ ఆభరణాలన్నీ వేసుకుంటే కుర్చీలో కూర్చోలేకపోయవాడిని. షూటింగ్ జరిగినంత కాలం ఒక స్టూల్ మీదే కూర్చునేవాడిని. షూటింగ్ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ రెండుసార్లు కింద పడిపోయా. ఒకసారి మొరాకోలో. ఇంకోసారి జార్జియాలో. రెండుసార్లూ దేవుడి దయ వల్ల ప్రమాదాలు తప్పాయి. జార్జియాలో అయితే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఇలాంటి కష్టాలన్నింటికీ ఓర్చి కేవలం 80 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయడం మాటలు కాదు’’ అని బాలయ్య అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/