Begin typing your search above and press return to search.

మహానాయకుడి భయం ఇదా?

By:  Tupaki Desk   |   5 Feb 2019 4:24 AM GMT
మహానాయకుడి భయం ఇదా?
X
ఎన్టీఆర్ కథానాయకుడు కథ ముగిసిపోయినా దాని తాలుకు చెడు జ్ఞాపకాలు మాత్రం ఇంకా అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. టాక్ తేడాగా వచ్చి సినిమా పోతే ఎవరికీ ఇబ్బంది లేదు. ఇది సర్వసాధారణం. కాని ఎన్టీఆర్ కు అలా జరగలేదు. మొదటిరోజు బాగుంది అన్నవాళ్ళే ఎక్కువ. అయితే వసూళ్లు దానికి పూర్తి వ్యతిరేక ధోరణిలో డిజాస్టర్ తరహాలో తెచ్చుకోవడమే బదులు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇంకా సస్పెన్స్ వీడని చిక్కు ప్రశ్న మహానాయకుడు ఎప్పుడు వస్తుందనేది. ఇంకా రీ షూట్లు కొనసాగుతున్నాయని క్రిష్ కొంత భాగాన్ని ఎడిట్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడని ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

షూటింగ్ జరుగుతోంది కాబట్టే బాలయ్య ఇంకా మీసాలు లేకుండా కనిపిస్తున్నాడని మరో టాక్. దీంట్లో లాజిక్ ఉంది. పాత్ర డిమాండ్ మేరకు తప్ప క్యాజువల్ గా బాలకృష్ణ ఎప్పుడూ మీసాలు లేకుండా కనిపించడు. ఎన్టీఆర్ మొదలుపెట్టాకే ఈ లుక్ లోకి వచ్చాడు. సో ప్రచారంలో ఉన్న వార్త నిజమయ్యే అవకాశం ఉందన్న మాట.

అయితే డేట్ ప్రకటించే విషయంలో మహానాయకుడు టీం ఎందుకు మీనమేషాలు లెక్కబెడుతోంది అనేదే అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం అసలు ఇప్పుడీ సినిమాను తీసుకొస్తే జనాలు రిసీవ్ చేసుకునే మూడ్ లో ఉన్నారా లేదా అనే సమాచారాన్ని సర్వే రూపంలో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందట.

అటు చూస్తే వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మీరు వదిలినప్పుడే రిలీజ్ చేస్తా అని రెచ్చగొడుతున్నాడు. అసలు దాని అవుట్ పుట్ ఎలా వస్తోంది అందులో ఏమేం తీస్తున్నారు లాంటి ఆరాలు కూడా తీస్తున్నారని చెప్పుకుంటున్నారు. నిజానికి యూనిట్ భయపడుతున్నట్టు ప్రస్తుతానికి పబ్లిక్ లో మహానాయకుడు మీద పెద్దగా బజ్ లేదు. ఏదైనా కొత్తగా ట్రైలర్ కట్ చేసి ఇది పూర్తిగా వేరే సినిమా అనే అభిప్రాయం కలిగేలా చేస్తే ఆసక్తి పెరగొచ్చు. అదెలా చేయాలి అనేదాని గురించే మల్లగుల్లాలు పడుతున్నారని తెలిసింది. ఇదంతా ఈ రెండు వారాల్లోనే డిసైడ్ కావాలి. అసలు క్రిష్ టీంకి మహానాయకుడుని ఫిబ్రవరిలో తెచ్చే ఆలోచన ఉందో లేదో