Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హడావిడి ఒక్కరోజే..

By:  Tupaki Desk   |   22 March 2018 5:53 PM IST
ఎన్టీఆర్ హడావిడి ఒక్కరోజే..
X
టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. అన్నగారు ఎన్టీఆర్ పాత్ర లో ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని తేజకి ఇచ్చాడు బాలయ్య. సినిమా విడుదల పక్కన పెడితే కనీసం షూటింగ్ కూడా ఇంకా మొదలవ్వలేదు.

అయితే సినిమా షూటింగ్ ను ఈ నెల మార్చ్ 29న లాంచ్ చేస్తున్నారనే వార్త బయటకి వచ్చింది. షూటింగ్ ఇంక ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుందేమో అని సంతోషపడేలోపే మేకర్స్ ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లేశారు. ఎందుకంటే షూటింగ్ జరిగేది ఆ ఒక్క రోజు మాత్రమేనట. రెగులర్ షూటింగ్ మాత్రం జూన్ కానీ జులైలో కానీ మొదలవబోతోంది. అది మంచి రోజు కాబట్టి నందమూరి వారసుడు బాలయ్య తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపు దిద్దుకుంటున్న సినిమాను ఆ రోజే హైదరాబాద్ - నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్ లో లాంచ్ చేయనున్నారు.

సినిమా కాస్టింగ్ పనులు అన్ని పూర్తయిపోయాయి. ఇంక షూటింగ్ మొదలవ్వడం ఒకటే బాకీ. బాలయ్యకు మంచిరోజు సెంటిమెంట్ బాగా ఉండటంతో సినిమాను లాంచ్ చేసేస్తున్నారు. తేజ కు ఇలాంటివి నచ్చకపోయినా బాలకృష్ణ కోసం ఒప్పేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమా లాంచ్ కు విచ్చేయనున్నట్టు సమాచారం.