Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బయోపిక్ కి బాలయ్య ముహూర్తం
By: Tupaki Desk | 5 March 2018 5:59 AM GMTస్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా తెరకెక్కించేందుకు ఆయన కుమారుడు బాలకృష్ణ సిద్ధమైన సంగతి తెలిసిందే. తండ్రి పాత్రలో తనే నటించనుండగా.. తను కూడా ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ మూవీకి సంబంధించిన అన్ని పనులు గతంలోనే పూర్తయిపోయాయి.
స్క్రిప్ట్ వర్క్ పూర్తయి చాలా నెలలు కావస్తుండగా.. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుందనే విషయాన్ని ప్రకటించారు. అయితే.. ఎన్టీఆర్ మూవీ ప్రారంభం ఎప్పుడనే అంశంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ.. ఎన్టీఆర్ సినిమా సంగతులు చాలానే చెప్పారు. అమరావతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. సెక్రటేరియట్ కు వచ్చిన ఆయన.. తన తర్వాతి సినిమా కబుర్లను పూస గుచ్చినట్లు వివరించారు. తండ్రి బయోపిక్ ప్రారంభానికి ముహూర్తం ఖాయమైందన్న ఆయన.. మార్చ్ 29 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నామని తెలిపారు.
ఈ సినిమాను రాజకీయ పరంగా చూడడం లేదని చెప్పిన బాలకృష్ణ.. రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసి రూపొందిస్తున్నామనే వార్తలను ఖండించారు. ప్రస్తుత యువతరానికి.. ఆ మహనీయుడి జీవితం గురించి తెలియచేయడమే లక్ష్యంగా చేసుకున్నామని.. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు బాలయ్య. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలానే అవసరం ఉండగా.. బడ్జెట్ లో మెజారిటీ పోర్షన్ వీటికే వెచ్చించనున్నారట.