Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డి గొడవపై బాలయ్య ఏమన్నాడంటే..?
By: Tupaki Desk | 5 May 2018 6:35 AM GMTరెండు నెలలకు పైగా టాలీవుడ్ ను కుదిపేసింది శ్రీరెడ్డి వ్యవహారం. ఈ మధ్యే ఆ గొడవ కొంచెం సద్దుమణిగింది. ముందు ఈ వ్యవహారాన్ని సినీ ప్రముఖులెవ్వరూ పట్టించుకోలేదు. దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా గళం విప్పక తప్పలేదు. కొందరు సూటిగా ఈ వ్యవహారంపై స్పందిస్తే.. ఇంకొందరు పరోక్షంగా దీనిపై వ్యాఖ్యలు చేశారు. ‘మహానటి’ ఆడియో వేడుకలో నాగార్జున.. జూనియర్ ఎన్టీఆర్ ఆ తరహాలోనే మాట్లాడారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సైతం శ్రీరెడ్డి ఇష్యూ మీద పరోక్షంగా స్పందించాడు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో బాలయ్య మాట్లాడాడు.
దాసరి గురించి ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి ఇష్యూను పరోక్షంగా ప్రస్తావించాడు బాలయ్య. ‘‘చలన చిత్రపరిశ్రమలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ముందుండి పరిష్కరించే వారు. ఆయన జీవితాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోసం త్యాగం చేశారు. ఆయన ఏ ఆదర్శాల కోసం దాసరి పోరాడారో.. వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంట్లో అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా.. కంట్లో నలక ఉంటే కనుగుడ్లు పీకేయాలా? ఇలా కాకుండా అందరం కలిసికట్టుగా ఆయన ఏ ఆదర్శాల కోసం బతికారో ఆయన స్ఫూర్తితో మనందరం కలిసుండి చలనచిత్ర పరిశ్రమను మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లేలా ముందుకెళ్దాం’’ అని బాలయ్య అన్నాడు. ఇక దాసరితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. దర్శకుడిగా ఆయన 150వ చిత్రం ‘పరమవీరచక్ర’లో నటించడం తన అదృష్టమని.. అంతకుముందు ఆయన ఎన్ని సినిమాలు చేశారో అన్ని సినిమాల ఆనందం.. అనుభూతి ఆ సినిమా ద్వారా నాకు కలిగిందని.. అంతకుముందు ‘శివరంజని’తోనే తనను కథానాయకుడిగా చేయాలని దాసరి భావించగా.. చదువు పూర్తయ్యాక చేద్దామని తన తండ్రి ఆపినట్లు బాలయ్య వెల్లడించాడు.