Begin typing your search above and press return to search.

శాతకర్ణి 79.. పైసా వసూల్ 78

By:  Tupaki Desk   |   28 Aug 2017 6:08 AM GMT
శాతకర్ణి 79.. పైసా వసూల్ 78
X
నందమూరి బాలకృష్ణ నటించన 101వ చిత్రం పైసా వసూల్.. వచ్చే నెల 1న రిలీజ్ అవుతోంది. ముందుగా అనుకున్న తేదీ కంటే నాలుగు వారాల ముందే ఈ సినిమాను థియేటర్లలోకి తెస్తుండడం విశేషం. పైసా వసూల్ రిలీజ్ కి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీస్ లో మరింత స్పీడ్ పెంచింది యూనిట్.

పైసా వసూల్ ఆడియో సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లోని దస్పల్లా హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలయ్య.. పూరీలతో పాటు మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. తాను రకరకాల జోనర్స్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడతానని అన్నారు. జానపదాలు.. పౌరాణికాలు.. ఇలా పూరీతో పాటు సాంఘికాలు చేయడం చాలా ఇష్టమని చెప్పిన ఆయన.. అభిమానులకు పంచభక్ష్య పరమాన్నాలు అందించే విధంగా త్వరగా సినిమాలు చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. తాను ఓ సినిమాపై నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువగా ఆలస్యం చేయనని.. అలాగే పూరీతో మూవీ చేయడంపై కూడా ఎక్కువగా ఆలోచించలేదని అన్నారు.

"గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి 79 రోజుల పాటు షూటింగ్ చేయగా.. పైసా వసూల్ ను 78 రోజుల్లోనే పూర్తి చేశాం. పోర్చుగల్ షూటింగ్ ను షెడ్యూల్ కంటే 4 రోజులు ముందే కంప్లీట్ చేశాం. అలాగని ఎక్కడా చుట్టేయడం లాంటివి ఉండవు. ఎంత ఖర్చుతో.. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. భారీగా మూవీ ఉంటుందో మీరు ఇప్పటికే ట్రైలర్ లో చూశారు కదా" అని చెప్పారు నందమూరి బాలకృష్ణ.