Begin typing your search above and press return to search.

టాక్ షోల్లోనే అమ్మ మొగుడై కూచుంది!

By:  Tupaki Desk   |   7 Jan 2023 1:30 AM GMT
టాక్ షోల్లోనే అమ్మ మొగుడై కూచుంది!
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `వీరసింహారెడ్డి` సంక్రాంతి రేసులో పందెం పుంజులా దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక ఆద్యంతం ఒంగోలులో వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో ఎంతో ఎమోష‌న‌ల్ గా సాగింది.

ఈ వేదిక‌పై బాల‌య్య చిత్ర‌బృందంపై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే గాక త‌న ఉన్న‌తికి ఈ స్థాయికి ఎద‌గ‌డానికి స‌హ‌క‌రిచిన‌ కార‌ణాల‌ను కూడా స‌ర‌దా ముచ్చ‌ట‌గా చెప్పిన తీరు ఆక‌ట్టుకుంది. నిజానికి వీర‌సింహారెడ్డి ప్రీఈవెంట్ లో సుమారు గంట సేపు బాల‌య్య అన్ స్టాప‌బుల్ గా మాట్లాడి అభిమానుల‌ను అల‌రించారు. అక్క‌డ‌క్క‌డా కొన్నిచోట్ల మాట త‌డ‌బ‌డినా ఆయ‌న గుండెల్లో నిండి ఉన్న ప్రేమాభిమానాలు ఫ్యాన్స్ హృద‌యాల‌ను తాకాయి. ఆయ‌న స్పీచ్ ఆద్యంతం ఆస‌క్తిగా విన్నారు.

ఇక ఇదే వేదిక‌పై త‌న గురించి ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు వినిపించిన కామెంట్ల గురించి బాల‌య్య బాబు ప్ర‌స్థావించారు. ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడుతూ ``ఈయ‌న ఇంతేలే`` అనుకున్న వారంద‌రిపైనా అదిరే లెవ‌ల్లో పంచ్ విసిరాడు. బాల‌య్య బాబు మాట్లాడుతూ-``ఇంతే ఈ సినిమాల‌కే ప‌రిమితం లే.. ఈయ‌న ఇంతే ... రాజ‌కీయాల‌కే ప‌రిమితం లే అనుకున్న వారికి కొత్త‌గా చూపించాల‌నుకున్నాను. ఆహా ఓటీటీలో హోస్ట్ అయ్యాను. మొత్తం టాక్ షోల్లోనే అమ్మ మొగుడై కూచుంది షో`` అంటూ త‌న‌దైన శైలిలో పంచ్ విసిరారు.

బాలయ్య పంచ్ అటు అల్లు కాంపౌండ్- గీతా ఆర్ట్స్ వ‌ర‌కూ.. అటు జూబ్లీహిల్స్ లో ఆహా ఆఫీస్ వ‌ర‌కూ రీసౌండ్ లా వినిపించిందంటే అతిశ‌యోక్తి కాదు. ఒకే ఒక్క పంచ్ తో ఆహా- ఓటీటీకి కావాల్సినంత ప్ర‌చారం తెచ్చి పెట్టారు బాల‌కృష్ణ‌. నిజానికి ఆహా ఓటీటీలో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్.బి.కే కార్య‌క్ర‌మం గొప్ప స‌క్సెసైంది. ఇటీవ‌ల రెండో సీజ‌న్ ర‌క్తి క‌ట్టిస్తోంది. ప‌లువురు టాప్ సెల‌బ్రిటీల‌తో బాల‌య్య త‌న‌దైన శైలిలో హోస్టింగ్ ని ర‌క్తి క‌ట్టించారు. ఆహాలో త‌న షో రంజుగా సాగేందుకు హోస్ట్ గా బాల‌య్య త‌నవంతు బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తున్నారు. ఓటీటీ రంగంలో `అన్ స్టాప‌బుల్` షోతో సరికొత్త‌ హంగుని తెచ్చిన హోస్ట్ గా బాల‌య్య బాబు పేరు మార్మోగ‌డం నిజంగా చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది.