Begin typing your search above and press return to search.
బాలయ్యా.. ఏంటీ కన్ఫ్యూజన్?
By: Tupaki Desk | 29 Jan 2016 4:47 AM GMTటాలీవుడ్ లో కన్ఫ్యూజన్ లేకుండా సినిమాలు చేసుకెళ్లిపోయే హీరో బాలయ్య. డైరెక్టర్ మీద గురి కుదిరితే.. ఇక కథ విషయంలోనూ పెద్దగా పట్టింపులు లేకుండా సినిమా చేసేస్తాడని అంటారు ఆయన సన్నిహితులు. ‘డిక్టేటర్’ విషయంలోనూ ఇదే జరిగింది. శ్రీవాస్ అడగడం.. కథ కూడా వినకుండా 99వ సినిమా చేసేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం.. చకచకా జరిగిపోయాయని చెప్పాడు బాలయ్య. ఐతే మామూలుగా ఇంత క్లారిటీతో, ఇంత క్యాజువల్ గా సినిమాలు చేసుకెళ్లిపోయే బాలయ్య.. తన వందో సినిమా విషయంలో వ్యవహరిస్తున్న తీరు అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. 100వ సినిమా విషయంలో బాలయ్యకు ఎంత క్లారిటీ ఉందో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
బాలయ్యతో సింహా - లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటే 100వ సినిమాకు డైరెక్టర్ అని ఏడాది కిందటే ఫిక్స్ అయిపోయి ఉండగా.. సింగీతం దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ను తెరపైకి తెచ్చి అందరికీ షాకిచ్చాడు బాలయ్య. ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ.. బాలయ్య ఒకటికి రెండుసార్లు ఈ మూవీ గురించి గట్టిగా చెప్పడంతో దానికే ఫిక్సయ్యారు అభిమానులు. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రామారావుగారు’ తెర మీదికి వచ్చింది.
ప్రస్తుతం అనిల్ సాయిధరమ్ తేజ్ తో ‘సుప్రీమ్’ చేస్తున్నాడు. అది ఇంకో రెండు మూడు నెలలకు కానీ పూర్తి కాదు. ఆ తర్వాత బాలయ్య కోసం స్క్రిప్టు పూర్తి చేయడానికి టైం పడుతుంది. ఇది బాలయ్య కెరీర్ లో ప్రెస్టీజియస్ మూవీ కాబట్టి.. బాగానే టైం తీసుకునే అవకాశముంది. ‘పటాస్’తో తన టాలెంటు బాగానే చూపించాడు కానీ.. రెండు సినిమాల అనుభవజ్నుడైన అనిల్ బాలయ్య వందో సినిమాను డీల్ చేయగలడా అన్న సందేహాలు లేకపోలేదు. ‘ఆదిత్య 999’ మీద చాలా పట్టుదలగా ఉండటం వల్లే బోయపాటితో ఇప్పుడు వద్దనుకున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను పక్కనబెట్టేసి అనిల్ తో సినిమా అంటుండటం ఏంటో బాలయ్య అభిమానులకు అర్థం కావడం లేదు. మొత్తానికి తన వందో సినిమా విషయంలో బాలయ్య తన ఫ్యాన్స్ కు క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో