Begin typing your search above and press return to search.

బాలయ్య.. ప్రతాపరుద్రుడా? గన్నా రెడ్డా?

By:  Tupaki Desk   |   19 Feb 2016 5:30 PM GMT
బాలయ్య.. ప్రతాపరుద్రుడా? గన్నా రెడ్డా?
X
నందమూరి నటసింహం ఇక 100వ సినిమా కోసం కసరత్తులు మొదలెట్టారు. అయితే ఇప్పటికే విభిన్న దర్శకులు.. ప్రాజెక్టులూ.. వినిపిస్తున్నదృష్ట్యా.. అసలు బాలయ్య 100వ సినిమాను ఎవరు డైరక్ట్‌ చేస్తారనేది మాత్రం అఫీషియల్‌ గా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ.. స్వయంగా ఈ నందమూరి హీరో మాత్రం ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌ ను చేస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఆదిత్య 369 సినిమాలో 'టైమ్‌ మెషీన్‌' చరిత్రలో వెనక్కి వెళ్లినప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి వెళ్ళి ఆగింది. అప్పుడు ఆ రాజు పాత్రలో బాలయ్య అలరించాడు. మరి ఇప్పుడు ఒకవేళ అలాంటి సీనే ఉంటే.. బాలయ్య ఏ కాలానికి వెళ్లి ఆగుతాడు? ఏ రాజుగా మారతాడు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ.. బాలయ్య కచ్చితంగా కాకతీయ వీరుడు గోన గన్నారెడ్డి పాత్రను చేస్తాడని కొందరు అంటుంటే.. అబ్బే లేదు రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడి పాత్రను చేస్తారని ఇంకొందరు చెబుతున్నారు.

ఏదేమైనా కూడా ఈ హిస్టారికల్‌ ఎపిసోడ్‌ అంటే ఈసారి రిస్కీనే. ''బాహుబలి'' వంటి క్రేజీ అవుట్‌ పుట్ చూశాక.. అసలు ''రుద్రమదేవి'' సినిమా గ్రాఫిక్స్‌ జనాలకు ఆనలేదు. అలాంటప్పుడు బాలయ్య తన సినిమాలో 90వ దశకంలో చూపించినట్లు చేసేస్తే కుదరదు. ఒక మగధీర - ఒక బాహుబలి టైపు క్వాలిటీ వర్కు చేయించాల్సిందే. వెయిట్‌ అండ్‌ సి.