Begin typing your search above and press return to search.

చిరు కంటే ముందు బాలయ్యే

By:  Tupaki Desk   |   5 Oct 2016 7:53 AM GMT
చిరు కంటే ముందు బాలయ్యే
X
మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సమరానికి దిగితే భలే రసవత్తరంగా ఉండేది ఒకప్పుడు. ఐతే చిరు సినిమాలకు దూరమైపోవడంతో చాలా ఏళ్ల పాటు వాళ్లిద్దరి పోరు చూసే అవకావం లేకపోయింది. ఐతే యాదృచ్ఛికంగా చిరంజీవి రీఎంట్రీ మూవీ.. బాలకృష్ణ వందో సినిమా ఒకేసారి మొదలయ్యాయి. ఒకేసారి విడుదల కూడా కాబోతున్నాయి. మరోవైపు వీళ్లిద్దరి తర్వాతి సినిమాలకు కూడా రంగం సిద్ధమవుతోంది. ముందు వీరిలో చిరంజీవే తన నెక్స్ట్ మూవీ దిశగా అడుగులు వేశారు. తన 151వ సినిమాను అల్లు అరవింద్ కు కమిటయ్యారు. దర్శకుడిగా బోయపాటిని అనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఐతే కొన్ని నెలలుగా పూర్తిగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మీదే దృష్టిసారిస్తూ వచ్చిన బాలయ్య కూడా ఇప్పుడు తన 101వ సినిమా మీద ఫోకస్ మళ్లించారు. చిరు కంటే ముందుగా ఆయన తన తర్వాతి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తుండటం విశేషం. తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కంటే ముందు ‘రైతు’ చిత్రాన్ని బాలయ్య పరిశీలించిన సంగతి తెలిసిందే. కృష్ణవంశీ ఓ విలక్షణమైన కథతో బాలయ్యను మెప్పించారు. ఐతే వందో సినిమాగా మరింత ప్రతిష్టాత్మకమైన కథ కోరుకున్న బాలయ్య క్రిష్ స్టోరీకే ఓటేశారు. ఐతే ‘రైతు’ కథ కూడా ఆయనకు బాగానే నచ్చింది. దాన్నే తన 101వ సినిమాగా చేయబోతున్నారు బాలయ్య. ప్రస్తుతం కృష్ణవంశీ సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ చేస్తున్నారు. అది దాదాపుగా పూర్తి కావచ్చింది. బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ పూర్తి చేసి ఫ్రీ అయ్యే సమయానికి బౌండెడ్ స్క్రిప్టుతో రెడీ అవనున్నాడు కృష్ణవంశీ. డిసెంబర్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/