Begin typing your search above and press return to search.

నాన్న ఆపకపోతే.. 150 చేసేవాడిని

By:  Tupaki Desk   |   13 Jan 2016 12:12 PM GMT
నాన్న ఆపకపోతే.. 150 చేసేవాడిని
X
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డిక్టేటర్ విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో సందడి చేసేందుకు డిక్టేటర్ వచ్చేస్తున్నాడు. సంక్రాంతి రిలీజ్ లలో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో బాలయ్య డిక్టేటర్ కూడా ఒకటి. సంక్రాంతి హీరో బాలయ్య ఈ సారి కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. డిక్టేటర్ బాలకృష్ణ నటించిన 99 వ సినిమా.

త్వరలో వందో సినిమాను పట్టాలెక్కించడానికి కూడా ఆయన రెడీ అయిపోతున్నారు. సింగీతంతో ఆదిత్య 999 స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాగా, తనకు సింహ లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటితో డిస్కషన్స్ లో ఉన్నారు బాలయ్య. వీటిలో దేనిని తన 150 మూవీగా చేయనున్నారన్నది జనవరి చివరినాటికి తెలిసిపోనుంది. ఈ వందో సినిమాను బ్లాక్ బస్టర్ గాను, చరిత్రలో నిలిచిపోయేదిగాను ఉండాలన్నది బాలకృష్ణ ఆలోచన. అయితే.. బాలయ్యకు వంద సినిమాల సంఖ్య చిన్నదే అనాలి. 1974 అరంగేట్రం చేసిన ఆయన.. 41 ఏళ్లకు వంద సినిమాల మార్క్ ను అందుకున్నారు.

అప్పట్లో చదువకునేప్పుడు తండ్రి ఎన్టీఆర్ బ్రేక్ వేశారు కానీ.. లేకపోతే నూయ యాభయ్యో, రెండొందలో చేసేసే వాడిని నేను అంటున్నారాయన. బాలయ్య 150 వ సినిమా.. ఊహించుకోవాడనికి సూబర్బ్ గా ఉంది కానీ.. ఆయన ఇలా ఎక్కువ చిత్రాలు చేసేవాడిని అనే మాట ఎప్పుడూ గతంలో వాడలేదు. ఈ 150 అనే అంకెను ఆయన ఎందుకు ఉపయోగించారంటరూ.. కొంపతీసి చిరు 150 వ సినిమాకి పడుతున్న ఆపసోపాలపై కౌంటర్ కాదు కదా..

ఇండస్ట్రీలో నటుడిగా 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న బాలకృష్ణ చెప్పిన మాటలు.. అక్షర సత్యాలు. అందుకే ప్రతీ కొత్త కుర్రాడు లాంఛింగ్ సమయంలో లవర్ బోయ్ రోల్స్ కే ప్రిఫర్ చేస్తారు. కానీ అఖిల్ విషయంలో ఇది చాలా దెబ్బతీసింది. మరి రెండో సినిమా నుంచి అయినా బాలయ్య పాఠాలు విని.. మంచి డెసిషన్స్ తో అక్కినేని అభిమానులను అఖిల్ అలరిస్తాడని ఆశిద్దాం.