Begin typing your search above and press return to search.
బాలయ్యకు నో రొమాన్స్ అండ్ సాంగ్స్?
By: Tupaki Desk | 25 Oct 2016 11:55 AM GMTగౌతమీపుత్ర శాతకర్ణి తాలూకు విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఒక ప్రక్కన నడుస్తుంటే.. మరో ప్రక్కన నటసింహం బాలయ్య తన 101వ సినిమా తాలూకు ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు. 100వ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన 101వ సినిమాను కృష్ణవంశీ డైరక్షన్లో ''రైతు''గా మన ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది ఇప్పుడు.
నిజానికి ''రైతు'' సినిమాలో బాలయ్య పెద్ద ప్రయోగమే చేయబోతున్నారని అంటున్నారు. గతంలో చాలాసార్లు తన వయస్సును 30 సంవత్సరాల వరకు పెంచుకుని ముసలి గెటప్స్ వేసిన బాలయ్య.. ఆ సినిమాల్లో యంగ్ బాలకృష్ణగా కూడా కనపించేవారు. అలా చేయకపోతే మరి హీరోయిన్లకు రొమాన్స్ కు స్కోప్ ఏముంటుంది. కాని రైతు విషయంలో మాత్రం ఆయన తన పంథాను పూర్తిగా మారుస్తున్నారట. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా రొమాంటిక్ సాంగ్ ఉండదని.. ఒకవేళ ఉన్నా కూడా.. బాలయ్యకు మాత్రం ఈ రొమాన్స్ అండ్ సాంగ్స్ ఉండవని అంటున్నారు.
ముఖ్యంగా ప్రోస్తెటిక్ మేకప్ సహాయంతో బాలయ్య చాలా నేచురల్ గా ఒక నిజజీవితపు రైతులా కనిపిస్తారట. రైతు సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తిరగబడే పాత్రలో ఆయన నటించనున్నట్లు టాక్. అంటే కమర్షియల్ మసాలా సినిమా తరహాలో కాకుండా.. ఒక మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాను తీస్తున్నారనమాట. బాగానే ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/