Begin typing your search above and press return to search.

జంగిల్ బుక్ లో పులి అప్పుడొస్తోందా?

By:  Tupaki Desk   |   30 July 2017 6:17 AM GMT
జంగిల్ బుక్ లో పులి అప్పుడొస్తోందా?
X
దసరా రేసులో మొన్నటివరకు నందమూరి బాలకృష్ణ ''పైసా వసూల్'' ఉన్నప్పుడు.. ఆల్రెడీ జూ.ఎన్టీఆర్ 'జై లవ కుశ'.. మహేష్‌ 'స్పైడర్' ఉన్నాయి కాబట్టి.. ఈయనకు కాస్త ఇబ్బంది పడుతుందేమో అనిపించింది. కాని ఇప్పుడు పూరి జగన్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా స్టంపర్ చూశాక.. అబ్బే జంగిల్ బుక్ లోని పులి యాజిటీజ్ చూపిస్తే.. ఎనీడే బాక్సాఫీస్ దగ్గర దసరా పండగే అనే అనుకోవాలి.

ఇప్పుడు 'పైసా వసూల్' సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనదేదే పెద్ద విషయం. అయితే పూరి జగన్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్కును హై స్పీడులో పూర్తిచేసేసి సినిమాను ఎలాగైనా కూడా సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ఒకవేళ పనులలో ఏదన్నా జాప్యం ఉంటే మాత్రం సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ చేస్తారట. ఈ విషయాన్ని పైసా వసూల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో క్లారిఫై చేసే అవకాశం ఉంది. గతంలో ఈ సినిమాను దసరా రేసులో ఉంచి సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని.. ఇప్పుడు మాత్రం పూరి అంతకంటే ముందే రావడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం.. ఇతర సినిమాలన్నీ కాస్త ఎడ్జస్టమెంట్లు చేసుకోవాల్సిందే.

ఆల్రెడీ సెప్టెంబర్ 1న రావడానికి సాయి ధరమ్ తేజ్ తన 'జవాన్' సినిమాను రెడీ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో యమా బిజీగా ఉంది. ఒకవేళ బాలయ్య కూడా అదే రోజున వస్తే మాత్రం.. సాయిధరమ్ కాస్త గట్టిగా తన సినిమాను ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే బాలయ్య తరహాలో తేజు కూడా మాస్ హీరోయే కాబట్టి.. బి అండ్ సి సెంటర్లలో డే వన్ నుండి పట్టు చూపించాలి మరి.