Begin typing your search above and press return to search.

ప్రోమో టాక్ః పైసా వసూల్.. వాటే ఎనర్జీ!!

By:  Tupaki Desk   |   16 Aug 2017 4:37 AM GMT
ప్రోమో టాక్ః పైసా వసూల్.. వాటే ఎనర్జీ!!
X
బాలకృష్ణ పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుండి ఆ సినిమా పై అంతకు అంతా అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కావడంతో దీనికి మరింత క్రేజ్ ఏర్పడింది. బాలయ్య స్టైల్ ఈ సినిమా మేకింగ్ వీడియొలు అన్నీ కలిపి చూస్తే వేటకు సిద్దంగా ఉన్న సింహంలా కనిపిస్తుంది. కొద్ది రోజులు కిందటనే స్టంపర్ పేరు మీద వచ్చిన బాలయ్య స్టంట్ మేకింగ్ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ఇప్పుడు సినిమా ప్రోమో సాంగ్ ఒకటి విడుదల చేశారు పైసా వసూల్ సినిమా టీమ్.

ఈ పాటలో ముఖ్యంగా చెప్పుకో తగ్గది అంటే అది కచ్చితంగా బాలయ్య ఎనర్జి గురించే. తన ఎనర్జి డాన్స్ తో అభిమానులుచే చిందులు వేయించే అంతగా చేశాడు బాలయ్య. ఆ వయస్సులో ఆ ఎనర్జీ ఎలా వచ్చిందో అంటూ చూసినోళ్ళకు షాకరే. ఈ సినిమాతో మరో మెరుపులాంటి అందం తెలుగు సినిమాకు పరిచయం కానుంది. కైరా దత్త్ అనే అమ్మాయి తన వంపులుతో ఈ పాటలో మెరిసింది. తన డాన్స్ మూవ్స్ తో అందరికీ ఉత్సాహం ఇవ్వనుంది. ఈ పాటకు పక్కా పైసా వసూల్ చేసే సత్తా ఉందినే చెప్పవచ్చు. మరో తెలుగు స్పెషల్ సాంగ్ హిట్ అయ్యి మాస్ బీట్ ను అభిమానించే వారికి మంచి పసందుగా ఉండబోతుంది ఈ పైసా వసూల్ ప్రోమో సాంగ్. అనూప్ రుబెన్స్ ఇచ్చిన్న ట్యూన్ కి అక్కడ బాలయ్య వేసిన స్టెప్లుకు అభిమానులు ఇప్పుడే దసరా జరుపుకుంటున్నారు.

ప్రోమో సాంగే ఇలా ఉంటే ఇంకా మిగతా పాటలు ఇంకా ఎంత పైసా వసూల్ చేసేవిదంగా ఉండబోతుందో అని ఆసక్తి రేపుతుంది. పూరీ జగన్నాధ్ సినిమాలలో ఉండే మ్యూజిక్ టచ్ ఈ పాటలో కనిపిస్తూనే ఉంది. సెప్టెంబర్ 1 న విడుదల అవుతున్న ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ముస్కాన్ సేథి.. శ్రీయ శరణ్ మరో హీరోయిన్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ పాటలో కనిపించే కొత్త అందం కైరా దత్త్ కూడా నటిస్తోంది. ​