Begin typing your search above and press return to search.

బాలయ్య స్టంపర్.. అంటే ఏంటంటే?

By:  Tupaki Desk   |   26 July 2017 7:49 AM GMT
బాలయ్య స్టంపర్.. అంటే ఏంటంటే?
X
రెండు రోజుల కిందటే ‘ఎన్బీకే 101 ఫీవర్’ అంటూ సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి ‘పైసా వసూల్’ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది ఈ చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 28న ‘బాలయ్య 101 స్టంపర్’ రిలీజ్ కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఐతే టీజర్ తెలుసు.. ట్రైలర్ తెలుసు.. కొత్తగా ఈ స్టంపర్ ఏందబ్బా అని అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు రెండు రోజులుగా. టీజర్‌ కు ఇలా కొత్త పేరు పెట్టారేమో అనుకుంటున్నారు. ఐతే ఈ స్టంపర్ అంటే ఏంటో ఇవాళ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘స్టంపర్’ అంటే టీజరూ కాదట.. ట్రైలరూ కాదట. రెంటికీ మధ్యన ఉంటుందట.

స్టంపర్ అంటే ఏంటో చెబుతూ ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది ‘పైసా వసూల్’ టీం. స్టంపర్ అంటే ‘టీజర్ కా బాప్’ అని.. ‘ట్రైలర్ కా బేటా’ అని ఈ వీడియోలో చూపించారు. దీన్ని కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. 28న ఉదయం 10.12 నిమిషాలకు ‘పైసావసూల్’ స్టంపర్ రిలీజ్ కానుంది. ఈ స్టంపర్ చాలా స్టైలిష్ గా.. ఎనర్జిటిగ్గా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. స్టంపర్ రిలీజ్ నేపథ్యంలో సినిమాలో నుంచి బాలయ్య కొత్త లుక్స్ కూడా లాంచ్ చేశారు. అందులో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు బాలయ్య. ఆయన లుక్ గత కొన్నేళ్లలో ‘ది బెస్ట్’ అనిపించేలా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ సెప్టెంబరు 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.