Begin typing your search above and press return to search.
ఒకే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ - బాలకృష్ణ
By: Tupaki Desk | 14 Sep 2018 6:50 AM GMTజూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ గా ఎదిగినా నందమూరి ఫ్యామిలీ మాత్రం ఆయన్ను దగ్గరకు రానివ్వలేదు ఇంతకాలం. కానీ... హరికృష్ణ మరణం తరువాత పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాలతో పాటు బాలయ్య సినీ అవసరాలు వారిని జూనియర్ ను చేరదీసేలా చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే బాలకృష్ణ సినిమాలో జూనియర్ ను తీసుకుంటున్నారని ఫిలిం ఇండస్ట్రీలో టాక్.
జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతో కాలం నుంచి చంద్ర బాబు దూరంగా పెట్టాడు . రాజకీయంగా హరికృష్ణను ఎదగనీయకుండా చేశారన్న ఆరోపణలూ ఆయనపై ఉన్నాయి. అలాంటి బాబు మొన్న హరికృష్ణ మృతి చెందిన రోజు అన్నీ తానే అయి నిర్వహించాడు , ఇక బాలకృష్ణ కూడా జూనియర్ విషయంలో ఎప్పుడూ దూరంగానే ఉండేవారు. బావ కమ్ వియ్యంకుడు అయిన చంద్రబాబు బాటలో నడిచే బాలయ్య జూనియర్ ను ఏమాత్రం పట్టించుకునేవారు కాదన్న విమర్శలున్నాయి. బాలకృష్ణ తన రెండవ కూతురు వివాహ నిశ్చితార్ధం సందర్భంగా జూనియర్ వెళితే కనీసం పలుకరించకపోగా బాలయ్య అవమానించాడని - జూనియర్ కన్నీళ్ల పర్యంతమై వెళ్లిపోయాడని చెప్పుకున్నారు . ఇది తెలిసి తన బిడ్డను అవమానిస్తావా ? అని హరికృష్ణ బాల కృష్ణతో మాట్లాడటం మానేశాడని అంటారు. అలాంటి బాలయ్య ఇప్పుడు జూనియర్ పట్ల ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారని చెబుతున్నారు.
బాలకృష్ణ తన అన్న హరికృష్ణ మరణం తరువాత మారినట్టు తెలిసింది . జూనియర్ ఎన్ఠీఆర్ స్టామినా ఏమిటో తెలిసిన ఆయన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో జూనియర్ ఎన్ఠీఆర్ ను పెట్టె ఆలోచన ఉన్నట్టు తెలిసింది . ఫ్లాష్ బ్యాక్ లో ఎన్ఠీఆర్ పాత్రలో జూనియర్ ను ఉంచితే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చిందని తెలుస్తుంది . బాలకృష్ణ - దర్శకుడు క్రిష్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది . నిజానికి ఈ సినిమా ప్రారంభానికి జూనియర్ ఎన్ఠీఆర్ ను ఆహ్వానించలేదు . అప్పుడు జూనియర్ బాధపడ్డాడు . అయినా బాబాయ్ బాలకృష్ణ అడిగితే తప్పకుండా తాత గారి చిత్రంలో నటిస్తానని అన్నాడు . కానీ దీనిపై బాలయ్య స్పందించలేదు . అయితే ఇప్పుడు బాలకృష్ణ జూనియర్ ను కలుపుకొని పోతే ఇటు సినిమా రంగంలోనూ - అటు రాజకీయ రంగంలోనూ లాభముందని గ్రహించాడని... అందులో భాగంగా సినిమాతో మొదలుపెట్టి మెల్లగా రాజకీయాల్లోనూ జూనియర్ ను వాడుకునే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది.