Begin typing your search above and press return to search.
'ఎన్టీఆర్' తో ఫ్యామిలీ రీయూనియన్ ప్రయత్నాలు!
By: Tupaki Desk | 29 Nov 2018 4:41 AM GMT‘ఎన్టీఆర్’ బయోపిక్ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. డిసెంబర్ 16వ తారీకున తిరుపతిలో భారీ ఎత్తున ‘ఎన్టీఆర్’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా హాజరు అవ్వడం దాదాపుగా ఖాయం అయ్యింది. ఇక ఈ కార్యక్రమం ద్వారా నందమూరి ఫ్యామిలీ అందరిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నందమూరి తారక రామారావు సంతానం సంఖ్య చాలా పెద్దదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని కారణాల వల్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విభేదాలను పక్కకు పెట్టి ఎన్టీఆర్ చిత్రం కోసం కుటుంబ సభ్యులందరిని కూడా ఏకం చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లను ప్రీ రిలీజ్ వేడుక వేదికపై చూపించే ప్రయత్నంను బాలయ్య చేస్తున్నాడట.
ఎన్టీఆర్ తనయులు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించాలని, కూతుళ్లు సినిమా ఆడియో సీడీని ఆవిష్కరించేలా కార్యక్రమం ప్లాన్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరు హాజరు అయినా పురందేశ్వరి, వెంకటేశ్వరరావు హాజరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడుతో వేదికను పంచుకునేందుకు వెంకటేశ్వరరావు ఆసక్తి చూపించక పోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ బాలయ్య ప్రత్యేకంగా పురందేశ్వరిని మరియు బావ వెంకటేశ్వరరావును ఆహ్వానిస్తే కనీసం పురందేశ్వరి అయినా వెళ్లే అవకాశం ఉంది. ఎన్ని విభేదాలున్నా కూడా తండ్రి సినిమా కనుక తప్పకుండా చిన్నమ్మ వస్తుందని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఇదే జరిగితే డిసెంబర్ 16న నందమూరి అభిమానులకు పెద్ద పండుగే అని చెప్పుకోవచ్చు.