Begin typing your search above and press return to search.
ఆ సినిమా కూడా అలాగే ఆగింది
By: Tupaki Desk | 26 April 2018 7:41 AM GMTటాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ఏమనుకొని స్టార్ట్ చేశారో గాని స్టార్ట్ అవ్వడానికి తంటాలు పడింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వకపోయినా సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. కానీ ఇప్పుడు సడన్ గా దర్శకుడు తేజ సినిమా నుంచి తప్పకున్నాడని తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే బాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో తన ప్రమేయం ఉండేలా చూసుకున్నారు. కథ మొత్తం వారికి నచ్చినట్టుగా పూర్తి చేయించుకున్నారు. అంతే కాకుండా నటీనటుల విషయంలో కూడా బాలయ్య తన ఆలోచనను నెగ్గించుకునే ప్రయత్నం చేసుకున్నారు. ఆ విషయం పక్కనపెడితే సడన్ గా తేజ తీసుకున్న డీసీషన్ పై అనేక అనుమానాలు వస్తున్నాయి. తేజ తన నిర్ణయంలో చాలా కఠినంగా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. మరి ఈ సినిమా విషయంలో ఆయానకేం నచ్చలేదో గాని నో చెప్పేశాడు.
ఇక ఇప్పుడు అంతటి బయోపిక్ ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు అనే ఆలోచనలో పడ్డారు. ఒక వేళ అన్ని కుదిరితే బలయ్యే సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ద్రౌపది అనే సినిమా చేద్దామనుకున్నా బాలయ్య మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే ఆ సినిమాలో సౌందర్య నటించాలి. కానీ ఆమె మరణించడంతో బాలకృష్ణ మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకోలేకపోయారు. ఇక ఇన్నాళ్ల తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం పర్యవేక్షణలో డైరెక్ట్ చేయనున్నట్లు టాక్.