Begin typing your search above and press return to search.
విలన్ గా కూడా.. ఇక దబిడిదిబిడి ఖాయమే!
By: Tupaki Desk | 12 April 2020 2:57 PM GMTబోయపాటి శ్రీను సినిమాలపై కొందరు మసాలా సినిమాలు అంటూ సెటైర్లు వేస్తుంటారు కానీ బోయపాటి లాగా మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులు టాలీవుడ్ లో అతి తక్కువ మందే. విలన్ - హీరోల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు డిజైన్ చెయ్యడంలో బోయపాటి స్టైలే వేరు. ఇక బలమైన విలన్ పాత్రలను డిజైన్ చేసి హీరోకు గట్టి ఛాలెంజ్ సెట్ చేస్తారు బోయపాటి. ప్రస్తుతం ఆయన నటసింహ నందమూరి బాలకృష్ణతో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ లో కనిపిస్తారని.. ఒక పాత్ర హీరో కాగా మరో పాత్ర విలన్ అని సమాచారం. అంటే ఈ సినిమాలో మరో నటుడిని తీసుకొచ్చి బాలయ్యకు విలన్ సెట్ చేయకుండా బాలయ్యకు మరో బాలయ్యనే విలన్ గా సెట్ చేయడం నిజంగా ఊహకందని విషయం. మామూలుగానే ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసే బాలయ్య ఇక ఈ విలన్ రోల్ లో దబిడిదిబిడి చెయ్యడం ఖాయమని.. ప్రేక్షకులకు తనదైన శైలిలో మెప్పిస్తారని అంటున్నారు. ఈ హీరో-విలన్ మధ్య వచ్చే సన్నివేశాలను బోయపాటి ప్రత్యేకమైన శ్రద్ధతో డిజైన్ చేశారట.
ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి ఈ పాత్రతో కలిపి ట్రిపుల్ రోల్ చేస్తున్నారా లేక సినిమాలో ఉండేది డబల్ రోల్స్ అయితే మొత్తం మూడు షేడ్స్ ఉంటాయా అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి గత కొన్నేళ్లలో బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు.. ఆయన స్టైల్ కు తగ్గట్టు ప్రెజెంట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించిన దర్శకులు అతి తక్కువమంది. వారిలో బోయపాటి ఒకరు. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారా? నందమూరి అభిమానులను మరోసారి మురిపిస్తారా అన్నది వేచి చూడాలి.