Begin typing your search above and press return to search.

బాలయ్యకి ఐఫోన్ ఓ లెక్కా

By:  Tupaki Desk   |   11 Jan 2016 1:30 PM GMT
బాలయ్యకి ఐఫోన్ ఓ లెక్కా
X
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డిక్టేటర్ రిలీజ్ కి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో నందమూరి అభిమానుల సందడి మొదలైపోయింది. కటౌట్లు - పాలాభిషేకాలు లాంటి వాటికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో డిక్టేటర్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా హాట్ టాపిక్ అయిపోతోంది.

బాలయ్య సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటాడో.. సెట్స్ అంత చిలిపిగా బిహేవ్ చేస్తారని.. తోటి హీరోయిన్స్ చాలాసార్లే చెప్పారు. ఆయన విగ్రహం చూసి భయపడ్డా.. చిన్నపిల్లాడి తరహాలో ఆట పట్టించే బాలయ్యను చూసి, భయం పోయిందని కూడా అంటారు. అలాగే ఎంత పెద్ద విషయాన్నైనా సింపుల్ గానే చూస్తుంటారు బాలయ్య. సాధారణంగా మన దగ్గర ఫోన్ ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. దానికి ప్రొటెక్షన్ ఉన్నా, గొరిల్లా గ్లాస్ లాంటి రక్షణ ఉన్నా.. చేయి జారకుండా అప్రమత్తంగా ఉంటాం. కానీ బాలయ్య మాత్రం చేతిలో ఏది ఉంటే దానితో ఆడేస్తుంటారు.

ఇలాగే హీరోయిన్ అంజలి పక్కన ఓ కుర్చీలో కూర్చుని కబుర్లు చెబుతున్నా బాలకృష్ణ, చేతిలో ఉన్న ఐఫోన్ ని గాల్లోకి ఎగరేసి క్యాచ్ లు పడుతున్నారు. అంత ఖరీదు చేసే ఐఫోన్ ని యథాలాపంగా అయినా గాల్లోకి ఎగరేయడం అంత తేలికైన విషయమేం కాదు. అయితే.. పది, ఇరవై మంది రౌడీల్ని - విలన్లను గాల్లోకి ఎగరేసి మరీ కొట్టే బాలకృష్ణకి... ఐఫోన్ ఓ లెక్కా. ఏదో మనసు పెట్టి విసరడం లేదు గానీ.. గట్టిగా విసిరితే.. ఎక్కడ పడిందో వెతుక్కోడానికి వారం పట్టదూ.