Begin typing your search above and press return to search.

32 కోట్లు తెస్తేనే పైసా వసూలవుతుంది

By:  Tupaki Desk   |   1 Sep 2017 5:59 AM GMT
32 కోట్లు తెస్తేనే పైసా వసూలవుతుంది
X
నందమూరి బాలకృష్ణ- పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ గురించి అనౌన్స్ చేసినప్పుడే ఓ సెన్సేషన్. ఇక ఈ మూవీ స్టంపర్.. థియేట్రికల్ ట్రైలర్ రూపొందించినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాలయ్యను ఇప్పటివరకూ చూడని యాంగిల్ లో పైసా వసూల్ లో దర్శకుడు పూరీ చూపించాడనే సంగతి అర్ధమవుతూనే ఉంది. అయితే.. ఫామ్ లో లేని పూరీ జగన్నాధ్ పై అనుమానాలు ఉన్నా.. బాలయ్య చలవతో పూరీ కూడా మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని అంటున్నారు.

పైసా వసూల్ ఇవాళే థియేటర్లలోకి వస్తుండగా.. ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనీసం 32.5 కోట్లను కలెక్ట్ చేస్తే మాత్రమే హిట్ అనిపించుకుంటుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ స్థాయిలో చేయడమే ఇందుకు కారణం. వైజాగ్ ఏరియాను 3 కోట్లు.. ఈస్ట్ 2.2 కోట్లు.. వెస్ట్ 2 కోట్లు.. కృష్ణా 2 కోట్లు.. గుంటూరు 3.6 కోట్లు.. నెల్లూరు 1.3 కోట్లకు విక్రయించారు. మొత్తం కోస్తా రైట్స్ 14.1 కోట్లు పలకగా.. సీడెడ్ ను 6 కోట్లకు.. నైజాం ఏరియా రైట్స్ ను 8 కోట్లకు అమ్మారు. కర్నాటక 2.2 కోట్లు.. ఓవర్సీస్ 1.7 కోట్లకు సేల్ అవగా.. ఇతర ఏరియాల నుంచి 50 లక్షల బిజినెస్ జరిగింది. మొత్తంగా 32.5 కోట్ల రూపాయలకు పైసా వసూల్ ధియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.

ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో 9.5 కోట్లు.. డబ్బింగ్ ఇతర హక్కుల రూపంలో 4 కోట్లు రావడంతో.. నిర్మాత దాదాపుగా సేఫ్ అయిపోయినట్లే. అయితే.. సినిమాను హిట్ అనాలంటే మాత్రం.. థియేటర్ల నుంచి 32.5 కోట్ల షేర్ ను కనీసం వసూలు చేయాల్సి ఉంది. బాలయ్య నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక చిత్రం తర్వాత వస్తున్న మాస్ మసాలా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.