Begin typing your search above and press return to search.
మోహన్ బాబును బాలయ్య ఎలా పొగిడాడంటే..
By: Tupaki Desk | 14 May 2016 7:07 AM GMTఅవును మోహన్ బాబును బాలయ్య ఓ రేంజిలో పొగిడేశాడు. తన తండ్రి తర్వాత తనకు అత్యంత స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మోహన్ బాబే అని కితాబిచ్చాడు. మోహన్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో విడుదల చేసిన ‘డైలాగ్ కింగ్’ పుస్తకానికి బాలయ్యే ముందు మాట రాయడం విశేషం. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంటులో విడుదల చేయడం విశేషం. ఆ ముందు మాటలో మోహన్ బాబు గురించి బాలయ్య ఏమన్నాడంటే..
‘‘ఒక వ్యక్తిగా.. నటుడిగా నాకు మా నాన్నగారు స్ఫూర్తి. ఆయన తర్వాత నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మోహన్ బాబు గారే. క్రమశిక్షణతో.. దృఢ సంకల్పంతో తాను అనుకున్న దారిలో ముందుకు సాగే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందారాయన. ఆయన డైలాగ్ డిక్షన్ అద్భుతం. సర్దార్ పాపారాయుడు సినిమాలో నాన్న గారితో కలిసి నటించినపుడు.. ‘మా వంటవాడు భారతీ..యుడు మా తోటవాడు భారతీ..యుడు అంటూ డైలాగ్ చెప్పిన తీరు అద్భుతం. నటనలో కావచ్చు.. డైలాగ్ డెలివరీలో కావచ్చు.. ఎంతోమంది ఆయన్ని అనుకరించి బతికారు కూడా. ఆయనతో కలిసి నటించే భాగ్యం నాకూ దక్కింది. ‘పాండురంగడు’ సినిమాలో ఆయన ఓ మంచి క్యారెక్టర్ చేశారు. అలాంటి పాత్రలు స్టేచర్ ఉన్న ఆయనలాంటి నటులు చేస్తేనే చెల్లుతుంది. ప్రేక్షకులకు చేరుతుంది.
నేను ఈ జన్మలో చేయలేనన్ని పాత్రలు చేశారాయన. ఆయన్ని నటుడు అంటే దూరం అవుతున్నాననిపిస్తుంది. నటుడిగా కంటే ఆయన్ని మంచి సోదరుడిగా భావిస్తాను. మా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా భావిస్తాను. నేను ఇండస్ట్రీలో ఇంకెవరితోనూ అంత సరదాగా ఉండను. ఒక్క మోహన్ బాబు గారితో తప్ప. ఆయన్ని కలుసుకున్నపుడు కలిగే ఆత్మీయత, వైబ్రేషన్స్ ఎవరిని కలుసుకున్నా కలగవు. ఆయన కుటుంబం కూడా నన్ను అలాగే గౌరవిస్తుంది. లక్ష్మి.. విష్ణు.. మనోజ్.. అన్నయ్యా అంటూ ఆత్మీయంగా పిలుస్తారు. వారితో ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారో’లో నటించాను. వారిదో వసుధైక కుటుంబం. విలక్షణ నటుడిగా మోహన్ బాబు పోషించిన పాత్రలైతేనేమి.. ఆయన చేపట్టిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలైతేనేమి.. విద్యానికేతన్ ద్వారా 25 శాతం మందికి ఉచిత విద్య అందించడమైతేనేమి.. ఆయన మా తరానికి..తర్వాతి తరాలకు ఆదర్శ ప్రాయుడు. గౌరవ డాక్టరేట్ తో పాటు పద్మశ్రీ కూడా సాధించి 40 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో తన సినిమాల్లోని డైలాగులతో ‘డైలాగ్ బుక్’కు నేను ముందు మాట రాయడం గర్వకారణం’’ అని బాలయ్య పేర్కొన్నాడు.