Begin typing your search above and press return to search.
అభిమానులపై చెయ్యేస్తే అసలు ఊరుకుంటాడా?
By: Tupaki Desk | 7 Jan 2023 11:30 AM GMTపరిశ్రమలో ఎందరు గొప్ప హీరోలున్నా నటసింహా నందమూరి బాలకృష్ణ వేరు! ఆయన మనస్తత్వం గురించి తెలిసిన సన్నిహితులు వేదికలపైనే అతడి తత్వం గురించి నిరభ్యంతరంగా మాట్లాడుతారు. కోపంలో తప్పు చేసిన అభిమానిని తిట్టేసే బాలయ్య అదే అభిమానుల యోగక్షేమాల విషయంలో అంతే ప్రేమాభిమానాలతో వ్యవహరిస్తారని సన్నిహితులు చెబుతుంటారు. తాజా ఉదంతం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.
నందమూరి నటసింహం నిన్న సాయంత్రం ఒంగోలు ప్రీప్రచార వేదికపై గర్జించిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు తనదైన శైలిలో సాగించిన స్పీచ్ లో మెజారిటీ భాగం స్పీచ్ అభిమానుల కేంద్రంగానే సాగింది. వేలు లక్షలు కోట్లాదిగా అభిమానులను సంపాదించడం తన పూర్వజన్మ సుకృతం అంటూ ఆనందం వ్యక్తం చేశారు బాలయ్య.
అయితే అభిమానులపైనే చెయ్యి చేసుకున్న బాలకృష్ణ అంటూ గతంలో పలు మీడియాలు నానా రచ్చా చేశాయి. ఆ వార్తను హెడ్ లైన్స్ లోకి తేవడంతో అంతా ఆశ్చర్యపోయారు. కొందరు నిజంగా అయోమయానికి గురయ్యారు. నాలుకతో అభిమానులను పొగిడేస్తూ చేత్తో లెంపకాయలు కొట్టడమేంటి? అంటూ సందేహం వ్యక్తం చేసింది ఒక సెక్షన్ మీడియా. అయితే నిన్న (శుక్రవారం) సాయంత్రం ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా పలు ఘటనలు ఇప్పుడు అభిమానుల్లో చర్చకు వచ్చాయి.
నిన్న సాయంత్రం ఒంగోలులో ప్రత్యేక హెలీకాఫ్టర్ (చాపర్) దిగి వెన్యూ వద్దకు వస్తున్న బాలయ్య కు శాలువా కప్పి ఆనందపరచాలనుకున్న అభిమాని తొందరపాటుతో అనుకోని ఒక తప్పిదం జరిగింది. ఆ శాలువా ఎన్బీకే కళ్లజోడును తాకగా అది కింద పడిపోయింది. దీంతో బాలయ్య అతడిపై ఆ సమయంలో చిరు కోపం ప్రదర్శించారు. అంతలోనే శాంత స్వరూపుడై అభిమానులంతా సురక్షితంగా ఉండాలని క్షేమంగా తిరిగి ఇండ్లకు వెళ్లాలని ఆకాంక్షించారు.
ఆ తరవాత తనను వేదికపై కలవడానికి వచ్చిన తన అభిమానులను అడ్డుకుని నెట్టి వేస్తున్న బౌన్సర్లను చూడగానే బాలయ్య కోసం నషాలానికి అంటింది. తన అభిమానిపై చెయ్యి వేసిన బౌన్సర్ ని ఉద్ధేశించి పక్కకు వెళ్ళమని (గట్టిగా వాదించి) మరీ బాలయ్య సీరియస్ అవ్వడం ఈ వీడియోలో కనిపిస్తోంది. తన అభిమాని మీద చేయి వేస్తే ఒక్క నిమిషం ఆగడు బాలయ్య అని మరోసారి నిరూపణ అయ్యింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో రచయిత బుర్రా సాయిమాధవ్ కూడా ఇదే చెప్పారు. కోపం వస్తే తన అభిమానులను కొట్టాలన్నా తిట్టాలన్నా ఆ హక్కు ఒక్క బాలయ్య బాబుకే ఉంటుంది. ఆ తరవాత అన్నీ మర్చిపోయి చిన్నపిల్లాడిలా తన అభిమానులను అక్కున చేర్చుకునేది ఆయనే.
ఫ్యాన్స్ ని ఇతరులు ఏదైనా అంటే ఆయన అస్సలు ఊరుకోరని కూడా తెలిపారు. ఇప్పుడు వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేదికపై ఘటన కూడా అది నిజమని నిరూపించింది. వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది. అభిమానుల వీరంగం ఈసారి పండగకి మరో లెవల్లో ఉంటుందని ఇప్పటికే అర్థమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.