Begin typing your search above and press return to search.
బాలయ్య సార్.. అంటే ఒప్పుకోడట
By: Tupaki Desk | 20 Jan 2016 9:38 AM GMTనందమూరి బాలకృష్ణ తెరమీద ఫెరోషియస్ క్యారెక్టర్లు చేస్తుంటాడు. పవర్ ఫుల్ డైలాగులు పేలుస్తుంటాడు. ఐతే షూటింగ్ జరిగేటపుడు మాత్రం బాలయ్య అంత సరదా మనిషి లేడంటోంది బొద్దుగుమ్మ అక్ష. ‘డిక్టేటర్’ సినిమాలో బాలయ్య సరసన కొన్ని సన్నివేశాల్లో నటించిన అక్ష.. ఆయనతో షూటింగ్ అనుభవాల్ని ఎప్పటికీ మరిచిపోలేనని అంటోంది. బాలయ్యతో కొన్ని రోజులే షూటింగులో పాల్గొన్నానని.. కానీ జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అనుభవాలు మిగిలాయని అక్ష చెప్పింది.
‘‘సినిమాలో కీలకమైన డిల్లీ ఎపిసోడ్ లో నేను కనిపిస్తా. ఆ ఎపిసోడ్ షూట్ చేసేటపుడు తొలి రోజు బాలయ్య గారిని చూసి బాలయ్య సార్ అన్నాను. దానికి ఆయన కోప్పడిపోయారు. నన్ను సార్ అంటే ఇకపై తనతో మాట్లాడనన్నారు. తనను జస్ట్ ‘బాల’ అంటే సరిపోతుందన్నారు. అయినా ఆయన్నలా పిలవడం ఇబ్బందిగానే అనిపించింది. ముందు బాలయ్య సీరియస్ గా ఉంటారని అనుకున్నా కానీ.. ఆయన చాలా జోవియల్ గా ఉంటారు. సెట్ లో నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. మేమిద్దరం సినిమాల గురించి, రాజకీయాల గురించి.. సూర్యుడి గురించి.. ఇంకా చాలా విషయాలపై మాట్లాడుకున్నాం’’ అని చెప్పింది అక్ష.