Begin typing your search above and press return to search.
తనయుడి ఎంట్రీ విషయంలో స్పందించిన బాలకృష్ణ!
By: Tupaki Desk | 20 Dec 2019 5:40 AM GMTతన తనయుడు మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో స్పందించారు నందమూరి బాలకృష్ణ. బాలయ్య తనయుడి సినీ ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. రెండు మూడేళ్ల కిందటే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గురించి సినీ వర్గాల్లో చర్చ జరిగింది. అదిగో.. ఇదిగో.. అంటూ అప్పుడే ఊహాగానాలు వినిపించాయి.
అయితే ఇప్పటి వరకూ అలాంటి హడావుడి ఏమీ లేదు. ఆపై మోక్షజ్ఞ మీడియాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. ఒక సాధారణ యువకుడిలా అతడు కనిపిస్తున్నాడు. ఈ రోజుల్లో యంగ్ స్టర్లు సినిమా హీరోలు కావాలంటే.. వారు ఫిజిక్ తో సహా లుక్ విషయంలో చాలా మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. బాలకృష్ణ తనయుడు మాత్రం అలా రెడీ అయినట్టుగా కనిపించడం లేదు.
దీంతో ట్రేడ్ వర్గాల్లో అసలు బాలకృష్ణ తనయుడు ఇప్పుడప్పుడే తెర మీదకు వస్తాడా? అనేది సందేహంగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ అంశం గురించి స్వయంగా బాలకృష్ణే స్పందించారు. తన తనయుడు సినీ ఎంట్రీ ఇస్తాడని బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే అదెప్పుడో చెప్పలేం అన్నట్టుగా ఆయన స్పందించారు.
అన్నీ కుదిరినప్పుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సినిమా చర్చల్లో అయితే అతడు పాల్గొంటున్నాడని, తనతో కథల గురించి చర్చిస్తూ ఉంటాడని బాలకృష్ణ చెబుతున్నారు. ఓవరాల్ గా తన తనయుడి సినీ ఎంట్రీకి కచ్చితమైన ముహూర్తాన్ని ఏమీ బాలకృష్ణ చెప్పడం లేదు. నందమూరి ఫ్యాన్స్ వేచి చూడాల్సి ఉంది!