Begin typing your search above and press return to search.
'నర్తనశాల'లో సీనియర్ ఎన్టీఆర్... సినిమా పూర్తి చేసే ఆలోచనలో బాలయ్య...?
By: Tupaki Desk | 22 Oct 2020 2:10 PM GMTవిశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన అద్భుతమైన చిత్రాలలో 'నర్తనశాల' ఒకటి. ఈ చిత్రాన్ని నటసింహ నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడని సంకల్పించారు. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు లతో 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌదర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అయితే అప్పట్లో చిత్రీకరించిన సన్నివేశాలను దసరా కానుకగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో 'నర్తనశాల' నుంచి అర్జునుడిగా బాలయ్య మరియు భీముడిగా రియల్ స్టార్ శ్రీహరి.. ద్రౌపది పాత్రలో నటించిన దివంగత సౌందర్య లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా మాట్లాడిన బాలయ్య 'నర్తనశాల'లో సీనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించనున్నాడని హింట్ ఇచ్చాడు.
బాలయ్య ఈ వీడియో ద్వారా 'నర్తనశాల' చిత్రాన్ని నిలిపేయడానికి గల కారణాలను వివరించారు. అలానే కేవలం రెండు సన్నివేశాలు మాత్రమే తీశానని.. అవి కూడా నటీనటుల 10 రోజుల కాల్షీట్స్ తీసుకొని 5 రోజుల్లోనే పూర్తి చేశానని.. మొత్తం కలిపితే 15 నిమిషాల నిడివి ఉంటుందని.. మిగతాదంతా చాలా బాగా ఫిలిప్ చేసాం.. నాన్నగారు కనబడకుండా మాత్రం ఉండదు.. కాకపోతే దానికి ఇంట్రెస్టింగ్ గా నేను ఏమేమి జత పరిచాను.. ఏమేమి చేసానన్నది మీరు చూస్తే అర్థం అవుతుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దసరాకి విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రోత్సహిస్తే మళ్ళీ ఈ పూర్తి సినిమాని బహుశా తీస్తానేమోనని బాలయ్య చెప్పుకొచ్చాడు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'నర్తనశాల' 17 నిమిషాల సన్నివేశాలను ఎన్‌బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు.