Begin typing your search above and press return to search.

డిక్టేటర్ స్టోరీ చెప్పేసిన బాలకృష్ణ

By:  Tupaki Desk   |   4 Jan 2016 12:53 PM GMT
డిక్టేటర్ స్టోరీ చెప్పేసిన బాలకృష్ణ
X
కొత్త సినిమా రిలీజ్ కి ముందు స్టోరీ చెప్పేయడం చాలా రిస్క్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే వరకూ థ్రిల్ ని మెయింటెయిన్ చేయాలని భావిస్తారు మేకర్స్. అందుకే ఎక్కడా చిన్న విషయం కూడా లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతుంటారు.

ఇలాంటి వాటికి నందమూరి నటసింహం బాలకృష్ణ చాలాదూరం. డేరింగ్ గా కీలక సన్నివేశాలు, డైలాగ్స్ ముందే చెప్పేస్తుంటారు ఆయన. ఆయా డైలాగ్స్ ను బాలయ్య పలికిన తీరు ఎలా ఉంటుందో చూడ్డానికే థియేటర్స్ కి వచ్చే ఫ్యాన్స్ బోలెడుమంది ఉంటారు. రీసెంట్ గా బాలయ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చిత్రం డిక్టేటర్ గురించిన సంగతులు రాబట్టడానికి యాంకర్ నుంచి బోలెడు ప్రశ్నలు వచ్చాయి. యాంకర్ కష్టాన్ని గమనించిన బాలకృష్ణ.. ఎందుకంత కష్టపడతారు, అడిగితే నేనే చెబ్తాగా అన్నట్లుగా.. ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ను వివరించేశారు.

హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నించే అమ్మాయి పాత్రను డిక్టేటర్ లో సోనాల్ చౌహాన్ చేస్తోంది. ఈమె ఓసారి రౌడీలతో డబ్బుకు సంబంధించిన సమస్యలో చిక్కుకుంటుంది. అప్పుడు బాలయ్య అండ కోరితే.. తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, తన ఇంటికొచ్చి అప్పు తీర్చమంటాడు విలన్. తర్వాత ఓ సందర్భంగా సోనాల్ చౌహాన్ ని కిడ్నాప్ చేస్తారు విలన్ గ్యాంగ్. అప్పుడు విలన్స్ అడ్రస్ ట్రేస్ చేయడానికి.. ముందు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇక అక్కడ బాలకృష్ణ ఫైట్ ని స్క్రీన్ పై చూడాలే కానీ.. చెప్పుకుంటే సరిపోదు.

ఇదీ బాలయ్య చెప్పిన సన్నివేశం. ఇలాంటి సీన్ ని రివీల్ చేయడమంటే అది బాలయ్యకే చెల్లింది. అంతే కాదు.. కొన్ని అదుర్స్ అనిపించే డైలాగ్స్ ను కూడా చెప్పి వినిపించారు బాలయ్య.