Begin typing your search above and press return to search.
12 మంది సంతానం.. 'మహానాయకుడు' లో సమాధానం
By: Tupaki Desk | 22 Feb 2019 2:07 PM GMTనందమూరి తారక రామారావు బయోపిక్ 'ఎన్టీఆర్' రెండు పార్ట్ లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కథానాయకుడుకు పాజిటివ్ టాక్ వచ్చినట్లుగానే మహానాయకుడుకు చిత్రానికి కూడా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే నందమూరి అభిమానులు 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ 12 మంది సంతానం గురించి ఆసక్తికర సమాధానం ఉంది.
విద్యావంతుడు - ఉన్నత ఉద్యోగం చేసిన వ్యక్తి - తెలుగు జాతి గర్వించదగ్గ సినిమాలు చేసిన వ్యక్తి ఎందుకు 12 మంది సంతానంను కనాల్సి వచ్చిందనేదది చాలా మంది అనుమానం. ఎన్టీఆర్ వంటి వారు ఎందుకు కుటుంబ నియంత్రణ పాటించలేదు అంటూ చాలా మంది విమర్శలు కూడా చేశారు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఆ విషయమై స్పందించలేదు. నిజమో అబద్దమో కాని 'మహానాయకుడు' చిత్రంలో అంత మంది సంతానంకు సమాధానం ఇచ్చారు.
'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రంలో బసవతారకం క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరిన సమయంలో ఎన్టీఆర్ తీవ్ర మనోవేదనకు గురి అవుతారు. ఆ సమయంలో డాక్టర్ ను వేడుకుంటూ పెళ్లి అయినప్పటి నుండి నా కోసం బతికింది - అప్పుడు ఎంత అమాయకంగా నావైపు చూసేదో ఇప్పుడు అంతే అమాయకంగా నావైపు చూస్తుంది. నా కోసం 12 మంది పిల్లలను కనింది. అప్పట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత ఆస్తి అన్నట్లుగా అనుకునే వారు.
బాలకృష్ణ పుట్టిన తర్వాత పిల్లలు వద్దని తాను అంటే చనిపోయిన రామకృష్ణ మళ్లీ పుడుతాడనే నమ్మకంతో పిల్లలను కంటూ వచ్చింది. బసవతారకం నాకోసం పిల్లలను కన్నదని ఎన్టీఆర్ పాత్ర కన్నీరు పెట్టుకుంటూ డైలాగ్ చెప్పడం జరిగింది. ఇది కన్విన్సింగ్ గా అనిపించకున్నా కూడా ఎన్టీఆర్ పై ఉన్న విమర్శలను కాస్త అయినా తూడ్చివేస్తుందని బాలయ్య ఇలా ఈ విషయాన్ని చెప్పి ఉండవచ్చు.