Begin typing your search above and press return to search.
చెయ్యనంటే చెయ్యనన్న నయనతార..
By: Tupaki Desk | 7 Jan 2018 8:30 AM GMTకెరీర్ ఆరంభంలో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసింది నయనతార. ముఖ్యంగా ‘వల్లభ’ లాంటి సినిమాల్లో ఆమె ఎంత హాట్ హాట్ గా కనిపించిందో తెలిసిందే. అలాంటి కథానాయికతో ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్ర వేయించడం పెద్ద సాహసమే. వ్యక్తిగత జీవితంలోనూ నయనతారకు కొంతమేర బ్యాడ్ ఇమేజ్ ఉండటంతో సీత పాత్రకు ఆమె కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కానీ బాపు-బాలయ్య కలిసి నయనతో ఆ పాత్ర చేయించడానికే సిద్ధపడ్డారు. ఐతే నిజానికి ఈ పాత్ర చేయమన్నపుడు నయనతార చెయ్యనంటే చెయ్యనందట. బాలయ్య ఎంత చెప్పినా ఆమె ఓకే చెప్పలేదట. కానీ కుదరదని ఫోన్ పెట్టేసిన నయనతార.. తన మాటలకు ప్రభావితమై తర్వాత సీత పాత్రకు ఓకే అన్నట్లుగా బాలయ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర ఎవరు చేస్తారు అన్న ఆలోచన రాగానే తాను ఫోన్ తీసుకుని నయనతారతో మాట్లాడినట్లు బాలయ్య చెప్పాడు. ఐతే తాను సినిమాలు మానేయాలన్న నిర్ణయానికి వచ్చానని.. క్షమించమని నయనతార హుందాగా చెప్పిందని.. ఐతే ఈ సినిమా చేస్తే చరిత్రలో నిలిచిపోతావని.. కుటుంబ సభ్యులు ఈ చిత్రంలో తనను చూసి గర్వపడతారని తాను చెప్పానని బాలయ్య తెలిపారట. అయినప్పటికీ నయనతార సినిమా చేయనంటూ ఫోన్ పెట్టేసిందని.. కానీ ఆమె మరుసటి రోజు అదే సమయానికి ఫోన్ చేసి ఓకే చెబుతుందని తాను దర్శకుడు బాపుతో అన్నానని.. అన్నట్లుగానే తర్వాతి రోజు ఫోన్ చేసిన నయనతార తాను ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పిందని బాలయ్య వెల్లడించారు. ఇక ఈ సినిమాలో తన తండ్రి చేసిన పాత్రను చేయడానికి తాను కొంచెం భయపడ్డప్పటికీ బాపు గారున్నారనే ధైర్యంతో ముందుకెళ్లిపోయినట్లు బాలయ్య చెప్పాడు.