Begin typing your search above and press return to search.
అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని
By: Tupaki Desk | 7 Jan 2023 3:54 AM GMTసంక్రాంతి రేసులో నటసింహా బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' పోటీబరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ గ్రాండ్ సక్సెసైంది.
ఈ వేదికపై బాలయ్య బాబు వాక్చాతుర్యం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. ఒకానొక సందర్భంలో నటసింహా కులాల ప్రస్థావన తేవడం నెటిజనుల్లో డిబేట్ కి తెర తీసింది. ఆయన తనని తాను అన్ని కులాలకు చెందిన వాడినని ప్రకటించుకున్నారు. తనకు అన్ని కులాల అభిమానులు ఉన్నారని బడుగు బలహీన కులాల పేర్లను కూడా ప్రస్థావించడం ఆసక్తికరం. అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని అంటూ ఆయన ఎంతో జోష్ తో మాట్లాడారు. తనకు కులాలకతీతంగా ఫ్యాన్స్ ఉన్నారని ఈ వేదికపై ప్రత్యేకించి నొక్కి పలికారు.
పరాక్రముడైన రెడ్డిని నేను.. నరసింహా నాయుడి(కాపు)ని నేనే.. జ్ఞానంలో బ్రాహ్మణుడిని.. ఐశ్వర్యంలో వైశ్యుడిని.. కల్మశం లేని వెలమని... అమ్మని మరిపించే కమ్మని..వ్యక్తిత్వంలో రాజుని అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని! అంటూ బాలయ్య కుల వివక్షతకు అతీతంగా మాట్లాడారు.
సింహం అడివిలో వేటాడుతుంది... ఈ మానవారణ్యంలో కుట్రలు కల్మష ప్రపంచంలో వేటాడే సింహాన్ని నేనే. రోషానికి ప్రతీకనై పౌరుషానికి గనిని అంటూ బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్ ఆద్యంతం ఆకట్టుకుంది.
వీరసింహారెడ్డి వేదికను శాసించే హక్కు ఉన్నవాడు.. పెద్దరికాన్ని తెచ్చే వాడు ఎవరున్నారు? ఈ వేదికకు సరైన అతిథి ఎవరున్నారు? అంటే బి.గోపాల్ గారిని పిలవాలనుకున్నాం. ఆయనే దీనికి అర్హుడు అంటూ తనకు సమరసింహారెడ్డి సహా ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించిన సీనియర్ దర్శకులు బి.గోపాల్ ని ఆయన గౌరవించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
మలినేని ఒంగోలియన్ .. ఒంగోలు గిత్త
తన దర్శకుడి గురించి బాలయ్య ఆకాశానికెత్తేశారు. గోపిచంద్ మలినేని అభిమానిగా ఈ సినిమా తీయడం తన అదృష్టమని అన్నారు. గోపీచంద్ మలినేని ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చి ఎంతో కష్టంతో పైకెదిగి దర్శకుడిగా నేడు ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలానే ప్రస్తుతం తనతో కలిసి చేసిన వీరసింహారెడ్డి మూవీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని నటీనటులు సాంకేతిక నిపుణుల నుంచి అద్భుత ఔట్ పుట్ ని తీసుకున్నాడని ప్రశంసించారు. ఒంగోలియన్ అంటూ మలినేనిని పిలిచిన బాలయ్య బాబు అతడు ఒంగోలు గిత్త అంటూ కితాబిచ్చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.