Begin typing your search above and press return to search.
సీఎం జగన్ తో భేటీపై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!?
By: Tupaki Desk | 15 Feb 2022 11:47 AM GMTనందమూరి బాలకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. తనని కలవాల్సిన అవరసం తనకు తేదని స్పష్టం చేశారని, బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం క్యాన్స్ హాస్పిటల్ లో జరిగిన ఓ కార్యక్రమాంలో పాల్గొన్న బాలకృష్ణ తనని కలిసిన పాత్రికేయులతో ఆఫ్ ద రికార్డ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట.
టిక్కెట్ రేట్లు పెంచాలని, పెద్ద చిత్రాలకు ప్రత్యేక షోకు వెసులు బాటుని కల్పించాలని కోరుతూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రభాస్, మహేష్ బాబు తదితరులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ భేటీపై తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరగడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటి సందర్భంగా తనని కూడా రమ్మని పిలిచారని, అయితే తాను రానని చెప్పానని నందమూరి బాలకృష్ణ తాజాగా వెల్లడింరని చెబుతున్నారు.
అంతే కాకుండా ఈ సందర్భంగా బాలయ్య మరిన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారని వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ ధరలు తక్కువగా వున్న సమయంలోనే తను నటించిన `అఖండ`బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లని రాబట్టిందన్నారట.
అంతే కాకుండా తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్ లోనే వుంటాయని, టికెట్ ధరలు తన సినిమాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావం చేపించబోవన్నారని, అంతే కాకుండా తన సినిమా బడ్జెట్ లని తాను అస్సలు పెంచబోనని స్పష్టం చేశారట.
గత వారం ఎపీ సీఎంని కలిసిన వాళ్లలో నందమూరి బాలకృష్ణ లేకపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మరువక ముందు బాలకృష్ణ తనని భేటీకి పిలిచారని, కానీ తాను వెళ్లడానికి ఆసక్తి చూపించలేదని ఆయన అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కోవిడ్ ఫస్ట్ వేవ్ ముగిసిన సమయంలో థియేటర్ల రీఓపెన్, షూటింగ్ లకు అనుమతులు ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు కొంత మంది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో బాలకృష్ణ ఎక్కడా కనిపించలేదు. తనని ఆహ్వానించకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాలయ్య భేటీకి హాజరైన వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీ హిల్స్ లో భూములు దక్కించుకోవాలనే తెలంగాణ ప్రభుత్వంలో భేటీ అవుతున్నారని, ఎంత మంది పంచుకుంటారో నేనూ చూస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం సృష్టించాయి.
ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేయడం మరింత దుమారంగా మారింది.