Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బయోపిక్.. కొత్త ట్విస్ట్
By: Tupaki Desk | 7 Jan 2018 7:43 AM GMTతన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తీయడానికి దాదాపు రెండేళ్లుగా సన్నాహాలు చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఐతే ఈ సినిమా గురించి తొలిసారి ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరిలోనూ కుతూహలం రేకెత్తిస్తున్న విషయం ఈ కథను ఎలా ముగిస్తారు.. ఇందులో ఏమేం విషయాలు చూపిస్తారని. ఐతే బాలయ్య వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడని.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు కారణంగా పదవీచ్యుతుడై.. తిరిగి ఆయనకు చెక్ పెట్టి ముఖ్యమంత్రి పదవిని అధీష్టించడం వరకే చూపిస్తారని.. ఇదే క్లైమాక్స్ అని.. లక్ష్మీపార్వతితో పెళ్లి.. మరణం లాంటి అంశాలేమీ ఇందులో ఉండవని ఇంతకుముందు వార్తలొచ్చాయి.
కానీ ఈ ప్రచారానికి బాలయ్య తెరదించేశాడు. తన తండ్రి జీవితంలో ఏ అంశాల్నీ విడిచిపెట్టకుండా బయోపిక్ లో చూపిస్తామని బాలయ్య స్పష్టం చేశాడు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. బంధువులు.. శ్రేయోభిలాషులతో పాటు శత్రువులు కూడా ఉంటారని.. వాళ్లందరినీ కూడా సినిమాలో చూపిస్తామని బాలయ్య స్పష్టం చేశాడు. తన తండ్రి జీవితంలోని ప్రతి అంశాన్నీ స్పృశిస్తామని.. ఆయన గురించి తెలియని విషయాలు కూడా చెబుతామని బాలయ్య అన్నాడు. శత్రువులు అనే మాటను బాలయ్య ఎవరిని ఉద్దేశించి అన్నాడో మరి. ఎన్టీఆర్ అయితే తన అల్లుడు చంద్రబాబు నాయుడినే అతి పెద్ద శత్రువుగా భావించారు ఒక సందర్భంలో. అయితే బాలయ్య తన బావ గురించి సినిమాలో వ్యతిరేకంగా చూపించే అవకాశమైతే లేదు. బహుశా బాలయ్య టార్గెట్ లక్ష్మీపార్వతి.. నాదెండ్ల లాంటి వాళ్లే కావచ్చు. ఇక ఈ సినిమా కోసం తాను దాదాపు 62 గెటప్పుల్లో కనిపించబోతున్నట్లు బాలయ్య చెప్పడం విశేషం. ఈ సినిమాలో బాలయ్యగా తన పాత్ర కూడా ఉంటుందని.. కానీ అది ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమవుతుందని బాలయ్య వెల్లడించాడు.