Begin typing your search above and press return to search.
62 గెటప్పుల్లో బాలయ్య కనిపిస్తాడు
By: Tupaki Desk | 9 Feb 2018 5:00 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న మహనీయ నటుడు నందమూరి తారక రామారావు. కళా ప్రపంచంలో ఉన్న అన్ని కోణాలను ఆయన హావభావాలతో ప్రతి సినిమాలో చూపించారు. ముఖ్యంగా చారిత్రాత్మక పౌరాణిక చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన శైలి నటనతో రాముడు - కృష్ణుడు అంటే అలానే ఉంటారేమో అనేలా ఒక భావనను కలిపించిన మహనీయుడు.
హీరో అయినా విలన్ అయినా నటనలో ఆ రాజసం కనిపించి తీరాల్సిందే. మరి అలాంటి నట సార్వభౌముని జీవిత చరిత్రను తెరపై రెండు గంటల్లో చూపించాలంటే చాలా కష్టంతో కూడుకున్నపని. అలాగే ఆయన జీవితంలో ఉన్న ఎన్నో కీలక సినిమాల పాత్రలను తెరపై చూపించడం మరొక పెద్ద ప్రయోగం. అలాంటి ప్రయోగాన్ని ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అనే ఆ సినిమాలో మొత్తంగా బాలయ్య 62 గెటప్పుల్లో కనిపించబోతున్నాడు.
అందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు. స్పెషల్ గా ఓ ఆర్ట్ టీమ్ ఆ వర్క్ లో బిజీ అయ్యిందని తెలుస్తోంది. ఏ తరహాలో గెటప్స్ ఉండాలో స్కెచ్ వేసి చూపిస్తున్నారట. కాస్ట్యూమ్ విషయంలో అలాగే మీసం కట్టు హెయిర్ స్టైల్ ఇలా ప్రతి విషయంలో వర్క్ నడుస్తోందట. చివరగా మొత్తంగా ప్రతి గెటప్ ని ఒక ఆర్ట్ ద్వారా చూపించి పూర్తిగా కాస్ట్యూమ్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య ఆ గెటప్పుల్లో ఏ స్థాయిలో నట విశ్వరూపాన్ని చూపిస్తాడో చూడాలి.