Begin typing your search above and press return to search.
బాలయ్య బ్రాందీ-విస్కీ ప్రేమ
By: Tupaki Desk | 18 Aug 2017 7:30 AM GMT101 మూవీతో మళ్లీ తన రిలాంచ్ అని నందమూరి బాలకృష్ణ "పైసా వసూల్" ఆడియో ఫంక్షన్ లో చెప్పేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఆడియో వేడుకను నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ఖమ్మం జిల్లాలో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు హెలికాప్టర్ లో అల్లరి చేస్తూ వచ్చిన బాలయ్య వేడుకలో కూడా స్పీచ్ తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడప్పుడు కొన్ని తొందరపాటు డైలాగ్స్ తో విమర్శలను మూతగట్టుకునే బాలయ్య మరోసారి ఓ భక్తి పాటని మద్యం దండకంగా అభివర్ణించి వార్తల్లో నిలిచారు.
ఆ పాట తను ఎక్కడో విన్నానని చెబుతూ.. ఓ సారి గుర్తు చేసుకొని పాడాడు.
"ఓ బ్రాందీ - ఓ విస్కీ - ఓ రమ్ము ఎంతో రుచిరా.. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా..
పాల మీగడలకన్నా - పంచదార చిలకలకన్నా - ఓ సారా నీ నామ మెంతో రుచిరా..
ఓ సారా దేవా.. నీవు బీరువై- బ్రాందివై- విస్కీవై- రమ్మువై - జిన్నువై - కాక్ టేలువై - గుడుంబావై - నాటు సారావై - డైలీ దేవుండవై - సంపూర్ణ మత్తు సిద్ధివై - రసస్ఫూర్తివై - రసాధి దేవతవై..." అంటూ తనదైన శైలిలో ఆలపించి జనాల చేత విజిల్స్ వేయించారు బాలయ్య.
అంతే కాకుండా సాహిత్యం తనకు ఎంతో ఇష్టమో మరో సారి చెప్పాడు. మద్యంలో ఉన్న మరో మధురమైన అనుభవాలను వివిధ రకాలుగా అభివర్ణించారు నందమూరి వారసుడు. "ఆల్కహాలువై - ఈతకల్లువై - తాటికల్లువై - ద్రాక్షసారావివై - మందు నామాంతరమ్మువై.. ప్రత్యక్ష దైవంబువై వచ్చి - మా నాల్కపై నిలిచి - మా గొంతులో జారి - ఉదరమ్ములో కొలువుండి, ఆఖలి బాధలు తప్పించి - ఈతి బాధలు మరిపించి - తారతమ్యాలు లేవనుచు మాకు బ్రహ్మానందమ్ము ప్రసాదించుము. ఓ దేవా - ఓ సారా దేవా... నమస్తే నమస్తే నమః" అంటూ స్పీడ్ గా పాడిన పద్యానికి ఖమ్మం మొత్తం దద్దరిల్లింది.
పైసా వసూల్ సినిమాలో ఇదే తరహాలో తాను కూడా ఓ పాట పాడాడని సూపర్బ్ గా వచ్చిందని చెప్పారు బాలయ్య. అయితే ఒక రాజకీయ నాయకుడిగా మరియు హీరో స్థాయిలో ఉన్న ఒక సెలబ్రెటీ ఈ తరహాలో సాహిత్యాలను ఆలపించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు నెటిజన్లు. సరదాకు పాడినా విమర్శలు చేసే వారు కూడా చాలామందే ఉంటారు. ఇప్పటికే తన కోపంతో కొన్ని నెగిటివ్ కామెంట్స్ అందుకున్న బాలయ్య ఇప్పుడు ఈ పాటలతో - పద్యాలతో ఎలాంటి కామెంట్స్ అందుకుంటారో చూడాలి.