Begin typing your search above and press return to search.
నేను కూడా అన్ని పాత్రలకు సరిపోను
By: Tupaki Desk | 27 Dec 2016 4:40 AM GMTగౌతమి పుత్ర శాతకర్ణి మూవీ ఆడియో వేడుక తిరుపతి వేదికగా జరిగింది. ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు సంగీతం ఇచ్చిన చిరంతన్ భట్ ను మనసారా అభినందించారు బాలయ్య. 'సంగీతంతో రోగాలు కూడా తగ్గించచ్చు. అటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయ్. ఇటువంటి చిత్ర రాజానికి.. ఆణిముత్యాల్లాంటి మణిపూసల్లాంటి పాటలు అందించిన చిరంతన్ భట్ కి అభినందనలు తెలియచేసుకుంటున్నాను' అన్నారు బాలయ్య.
అలాగే ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ ను స్టేజ్ మళ్లీ చెప్పారు బాలయ్య. 'పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం. దొరకని వాడిని తరుముదాం. ఏదేమైనా దేశం మీసం తిప్పుదాం' లాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉంటాయన్నారు. 'ఆ పాత్రకు నేను సరిపోతానని క్రిష్ అన్నారు. నేను కూడా అన్నిపాత్రలకు సరిపోను. కళాకారుడికి లిమిట్స్ ఉంటాయ్. ఇవాళ మీతో నటసింహం అని పిలించుకుంటున్నానంటే అది ఆ పుణ్య దంపతుల ఆశీర్వాదమే. అలాగే ఎంఎల్ఏగా పిలిపించుకుంటున్నా వారి ఆశీర్వాదాలే కారణం' అంటూ తన తల్లి దండ్రులను గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.
'దేశమంతా వానలు పడినా మా సినిమా షూటింగ్ కి ప్రకృతి కూడా సహకరించింది. అవసరం అయినపుడు తప్పితే.. షూటింగ్ ను డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు వెంకన్న దివ్య సన్నిధిలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అదృష్టం. సంకల్పం - దీక్ష - అకుంఠిత పట్టుదల ఉండాలని తండ్రిగారి దగ్గర నుంచి నేర్చుకున్నా' అన్న బాలయ్య.. 'నవ్యాంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు గారికి కష్టపడుతున్నారంటే.. అది కూడా సంకల్పమే. అమరావతి కడుతున్నారని మేము సినిమా తీద్దామని అనుకోలేదు. అది దైవసంకల్పంతో కాకతాళీయంగా జరిగింది' అంటూ అమరావతిని పాలించిన చక్రవర్తిపై ఇప్పుడు సినిమా తీయడంలో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
'సరిహద్దుల్లో స్మశానాలు నిర్మిస్తాం. మొండేల మీద దండేలు ఎగరేస్తాం' అంటూ శాతకర్ణిలో డైలాగ్ తో అలరించిన బాలయ్య.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సినిమాలో ఒక పాట చేశారని.. అది అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. 'నయనతార లేకపోతే శ్రీరామరాజ్యం లేదు.. హేమమాలిని లేకపోతే గౌతమిపుత్ర శాతకర్ణి లేదు. ఆవిడ లేకపోతే ఈ సినిమా లేదు' అంటూ హేమమాలిని పాత్ర గురించి గొప్పగా చెప్పారాయన.
'తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే మనసు ఉప్పొంగుతుంది. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది. ఎన్ అంటే నటన. టీ అంటే తారా మండలంలోని తారకుడు. ఆర్ అంటే రాజకీయ ధురంధరుడు' అంటూ ఎన్టీఆర్ కు కొత్త అర్ధం చెప్పారు బాలకృష్ణ
నిజానికి ఎన్టీఆర్ కు ఈ పాత్ర చేయాలని ఉండేదని.. రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో.. చేయలేకపోయారన్న బాలకృష్ణ.. ఆ సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం' అంటూ సంతోషం వెలిబుచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/