Begin typing your search above and press return to search.
గుండమ్మ కథ తర్వాత జైసింహనే
By: Tupaki Desk | 23 April 2018 6:51 AM GMT ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి విడుదలైన జైసింహ వంద రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడింది రెండు సెంటర్లే అయినప్పటికీ ఇప్పుడున్న ట్రెండ్ లో ఇదే గొప్ప విషయం కాబట్టి నిర్మాత సి.కళ్యాణ్ గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో నిన్న శతదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనకు ఈ చోటుతో చాలా అనుబంధం ఉందన్న బాలయ్య గుండమ్మ కథ-మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర లాంటి సినిమాల హండ్రెడ్ డేస్ ఫంక్షన్లు ఇక్కడే చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసారు. తండ్రిలా నటించడం వారసత్వం కాదని నిజంగా లైఫ్ లో వారిలా జీవించడం అని చెప్పిన బాలయ్య ఆద్యంతం ఫాన్స్ ని అలరించేలా తన స్పీచ్ కొనసాగించడం విశేషం. జై సింహ రూపంలో పదేళ్ళ తర్వాత శతదినోత్సవం చూస్తున్నాను అని చెప్పిన దర్శకుడు కెఎస్ రవికుమార్ బాలయ్యతో మళ్ళి చేయాలనే ఆసక్తి తన మాటల్లో చూపించారు.
జైసింహ వంద రోజుల సంబరానికి గుంటూరు ఫాన్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. గత కొన్నేళ్ళుగా బాలయ్య సినిమాలు మాత్రమే వంద రోజులు దాటుతూ కొన్ని చోట్ల రికార్డులు కూడా సెట్ చేస్తున్నాయి. అవి నిజంగా ఆడుతున్నాయా లేక తమ హీరో మీద అభిమానంతో ఫాన్స్ నడిపిస్తున్నారా అనేది అప్రస్తుతం కాని మొత్తానికి మర్చిపోయిన ఒక పాత్ర ట్రెండ్ బాలకృష్ణ సినిమాల ద్వారా మళ్ళి జీవం పోసుకుంటోంది. ఒకప్పుడు నెలకో వంద రోజుల వేడుక జరిగేది. ఇప్పుడా ఊసే లేకుండా పోయింది. ప్రీ రిలీజ్ మహా అయితే సక్సెస్ మీట్. ఇక్కడితోనే ఏ సినిమా అయినా తన ప్రస్థానాన్ని ముగించేస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే బాలయ్య సినిమాలు వంద రోజులు ఆడటం చిన్న విషయం కాదుగా.