Begin typing your search above and press return to search.

లయన్‌ ఆడియో: సింహం గర్జించింది...

By:  Tupaki Desk   |   9 April 2015 5:04 PM GMT
లయన్‌ ఆడియో: సింహం గర్జించింది...
X
లయన్‌ మాట్లాడితే అచ్చ తెలుగులో అదరిపోతుందని ఎవరికి తెలియదు? అందిరీక తెలుసు. ఇక లయన్‌ ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణ ఇరగదీశారు. ఆయన తన స్పీచ్‌తో నందమూరి అభిమానులను ఉర్రూతలూగించారు. అచ్చతెలుగులో తన పాండిత్యం చూపడం దగ్గరనుండి, తన తండ్రిగారైన నందమూరి తారక రామారావు గొప్పతనం గురించి కొనియాడడం వరకు, ఫ్యాన్స్‌ను ఆకాశానికి ఎత్తేయడం దగ్గర నుండి తెలుగు ప్రజల ఔన్నత్యం గురించి మాట్లాడటం వరకు.. బాలయ్య సూపర్‌ సక్సెస్‌ అంతే.

''తెలుగ ప్రజల మధ్య పుట్టడం నా అదృష్టం అయితే, తెలుగు ప్రజలకోసం రామారావు గారు పుట్టడం మనందరి అదృష్టం'' అంటూ బాలయ్య ఉద్రేకభరితమైన ప్రసాంగాన్ని ఇచ్చారు. ''తెలుగు బాష గొప్పదనం మనకు తెలిసిందే. దానిని మర్చిపోకూడదు. లయన్‌ సినిమాలో మీకు కావల్సిన ఎన్నో పంచ్‌లు ఉన్నాయి. బాలకృష్ణ సినిమాలు ఎలాగుంటాయో అలానే ఉంటుంది ఈ సినిమా'' అంటూ తన స్టయిల్లో ఓ రెండు డైలాగులు కూడా వినిపించారు. ''భగవద్గీత యుద్దానికి ముందూ వినిపిస్తారూ... మనిషి చనిపోయిన తరువాత కూడా వినిపిస్తారు. ముందు వింటావా? తరువాత వింటావా?'' అంటూ సినిమాలోని డైలాగ్‌ బాలయ్య చెబుతుంటే.. ఇక ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులేదు.

రాజకీయా పరమైన అంశాలను టచ్‌ చేస్తూ.. ''హిందూపూర్‌ నా హృదయం అయితే, తెలుగుజాతి నా శరీరం'' అంటూ బాలయ్య ఒక ఎమ్మెల్యే హోదాలో సెలవిచ్చారు. కట్‌ చేస్తే, అభిమానులు బాలయ్య సిఎం అంటూ అరవడం స్టార్ట్‌ చేశారు. చివరాకరిగా.. ''బాలయ్యను పెట్టుకుంటే.. చిట్టెలుకలైనా, చిరుత పులులైనా మాడి మసైపోతాయ్‌'' అంటూ పరోక్షంగా ఎవరిమీదనో ఆయన సెటైర్లు కూడా వేశారు. అది సంగతి.