Begin typing your search above and press return to search.

మెగా ఈవెంట్ లో బాలయ్య మెగా స్పీచ్

By:  Tupaki Desk   |   27 Jan 2018 5:18 PM GMT
మెగా ఈవెంట్ లో బాలయ్య మెగా స్పీచ్
X
కొన్నేళ్ల క్రితం హీరోల మధ్య విభేదాలు ఉండేవని ఇప్పుడు కూడా ఉన్నాయని కొన్ని కామెంట్స్ వస్తుండడం చాలా కామన్. దీంతో కొంత మంది అభిమానులు ఈజీగా నమ్మేస్తుంటారు. వేరేగా కొంత మంది మధ్యలో ఏమైనా పోటీ ఉంటుందో గాని సినిమాల పరంగా మాత్రం ప్రస్తుత రోజులో హీరోల మధ్య హెల్దీ రిలేషన్ ఉందన్నది మాత్రం చాలా నిజం. ఆ తరహాలో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలి హీరోలు చాలా స్నేహంగా ఉంటారని రీసెంట్ గా కొన్ని మూమెంట్స్ చెప్పకనే చెప్పాయి.

రామ్ చరణ్ - ఎన్టీఆర్ జోడి అలాగే పవర్ స్టార్ - తారక్ ఒకే చోట కలుసుకోవడం. ఒకరి సినిమాలకు మరొకరు క్లాప్ కొట్టడం. కలిసి నటించబోతుండడం చూస్తూనే ఉన్నాం. అయితే అదే తరహాలో బాలకృష్ణ కూడా మెగా ఫ్యామిలీతో చాలా ఏళ్లుగా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఇక ఈ రోజు ఆయన మెగా మేనల్లుడి సినిమా టీజర్ ను స్వయంగా రిలీజ్ చేయడంతో మెగా నందమూరి అభిమానులు చాలా ఆనందించారు. రీసెంట్ గా సి.కళ్యాణ్ నిర్మించిన జై సింహ సినిమాతో బాలయ్య హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అదే బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఇంటిలిజెంట్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ..సి కళ్యాణ్ - వినాయక్ కాంబినేషన్ నాలుగో సారి కలిసింది. ఇంతకుముందు వినాయక్ డైరెక్షన్ లో చెన్నకేశవ రెడ్డి సినిమా చేశాను.

ఆయన డైరెక్షన్ లో మరొకసారి చేయాలనీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన పనితనం, ఆర్టిస్ట్ లను సమానంగా మ్యానేజ్ చేయడం విషయాలు నాకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా టేకింగ్ ఇష్టం. ఇలాంటి దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండడం నిజంగా గర్వకారణం. ఇక సినిమా టీజర్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా సినిమా మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు ముఖ్యంగా యువతకు ఇంటిలిజెంట్ సినిమా తప్పకుండా నచ్చుతుందని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కు మంచి విజయాన్ని అందించాలని ఆశిస్తున్నట్లు బాలయ్య తెలియజేశారు.