Begin typing your search above and press return to search.
పాపం అనుభవించడానికే పుడతారు-బాలయ్య
By: Tupaki Desk | 4 March 2016 4:51 PM GMTనారా రోహిత్ హీరోగా నటించిన సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్ కి.. నందమూరి నటసింహం బాలకృష్ట చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. నందమూరి నారా అభిమానులు అంటూ కొత్త వర్డింగ్ తో మాటలు ప్రారంభించిన బాలయ్య.. ఆద్యంతం సరదాగా మాట్లాడుతూ అభిమానులను అలరించారు. అభిమాన కుటుంబ సభ్యులందరికీ అనడంతో.. ఫ్యాన్స్ సంబరం అంబరాన్ని తాకేసింది.
నారా రోహిత్ ను అభినందిస్తూనే.. పాటలు బాగున్నాయని, మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తున్నాయని బాలకృష్ణ తెగ ప్రశంసించారు. సావిత్రి అంటూ లేడీ టైటిల్ పెట్టడాన్ని పొగుడుతూ.. లెజెండ్ మూవీలో మహిళలను గొప్పతనాన్ని చెబుతూ తను చెప్పిన డైలాగ్ ని మరోసారి రిపీట్ చేశారు. ఉన్నకొద్దీ స్పీచ్ లో పదును పెంచిన నటసింహం.. ఓ సందర్భంలో ఆత్మ అనే మాట వచ్చాక ఇక ఫుల్ స్వింగ్ లోకి వెళ్లిపోయారు. యాక్టింగ్ అంటే నవ్వడం, ఏడవడం కాదు
గత జన్మలో పాపాలు చేసినందుకు, వాటిని అనుభవించడానికే పుడతూ ఉంటాయని... కాని కొందరు మాత్రం కారణ జన్ములు అని, ఆయనే నాన్నగారు నందమూరి నందమూరి తారక రామారావు అని చెప్పారు.
ఈ సినిమాలో నారా రోహిత్ కూడా ఒక పాట పాడడాన్ని అభినందిస్తూ.. 'నేనూ అడుగుతున్నా కానీ.. నాతో ఎవరూ పాడించడం లేదు. అందుకే స్టేజ్ మీద, కచేరీల్లో పాడుకుంటున్నా. ఏమైనా మా రోహిత్ ధైర్యం చేశాడు' అని బాలయ్య చెప్పడంతో ఆడిటోరియం అంతా నవ్వులు పూయించింది.
ఇక కొర్రపాటి సాయి సినిమాలో తారకరత్న మంచి పాత్ర పోషిస్తున్నాడని.. త్వరలో మా కాంబినేషన్స్ లో మంచి మంచి సినిమాలు చూస్తారంటూ.. తన వందో సినిమాలో తారకరత్న చేస్తున్నాడని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు బాలయ్య.
ఎవరినైనా అనుకరించే వాళ్లు నకిలీ అవుతాడని.. కానీ పాత్రలో జీవించేవాడు మాత్రమే నటుడిగా నిలిచిపోతాడని అన్నారు బాలయ్య. ఇక స్టేజ్ మీద సరదాల విషయంలోనూ బాలకృష్ణ ఏ మాత్రం తగ్గలేదు. గిల్లడాలు - పొడవడాలు ఉండాలని.. తాను ఎక్కని ఎత్తుల్లేవు, చూడని లోతుల్లేవు అని చెప్పడంతో.. అందరూ గొల్లున నవ్వేశారు.
అభిమానులంతా డైలాగ్ చెప్పాలని.. మోక్షజ్ఞ సంగతి చెప్పాలని అడిగితే.. 'నా కొడుక్కి టైం ఉంది, మనవడికి టైం ఉంది' అని బాలయ్య రిటర్న్ కౌంటర్ వేసేశారు.