Begin typing your search above and press return to search.

గౌత‌మీపుత్ర గెట‌ప్‌ లోనే బాల‌య్య పుష్క‌ర‌స్నానం

By:  Tupaki Desk   |   12 Aug 2016 8:22 AM GMT
గౌత‌మీపుత్ర గెట‌ప్‌ లోనే బాల‌య్య పుష్క‌ర‌స్నానం
X
గౌత‌మీ పుత్ర శాత‌కర్ణి చిత్రంలో బిజీబిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే - సినీ న‌టుడు బాల‌య్య.. ఆ బిజీ షెడ్యూల్‌ ను సైతం ప‌క్క‌న పెట్టి కృష్ణా పుష్క‌రాల్లో తొలిరోజు స్నానం చేశారు. పుష్కర స్నానాల కోసం గురువార‌మే ఆయన భార్య వసుంధ‌ర స‌మేతంగా విజ‌య‌వాడ చేరుకున్నారు. గురువారం రాత్రి ప‌విత్ర సంగ‌మ ప్రాంతంలో గోదావ‌రి నుంచి పుష్క‌రుడు కృష్ణా న‌దిలో క‌లిసే స‌మ‌యంలో స్వాగ‌తం ప‌లికే కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు - ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రితో స‌హా బాల‌య్య కూడా పాల్గొన్నారు. దాదాపు అర‌గంట‌కు పైగా జ‌రిగిన కృష్ణా హార‌తుల‌ను తిల‌కించారు. అక్క‌డి న‌మూనా ఆల‌యాల‌ను సీఎం చంద్ర‌బాబు ప్రారంభించిన కార్య‌క్ర‌మంలోనూ బాల‌య్య పాల్గొన్నారు.

శుక్ర‌వారం ఉద‌యాన్నే విజ‌య‌వాడ‌లోని దుర్గాఘాట్‌ లో సీఎం చంద్ర‌బాబు దంప‌తులు స్నానం ఆచ‌రించి కృష్ణా పుష్క‌రాల‌ను అధికారికంగా ప్రారంభించిన స‌మ‌యంలోనే బాల‌య్య ఆయ‌న స‌తీమ‌ణి కూడా స్నానం చేశారు. కృష్ణాన‌దికి పసుపు - కుంకుమ స‌మ‌ర్పించారు. అయితే, ఆయ‌న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి గెట‌ప్‌లోనే దుర్గాఘాట్‌ కు రావ‌డంతో యాత్రికులు ఆయ‌న‌ను క‌న్నార్ప‌కుండా చూస్తూనే ఉండిపోయారు. ఒక‌ర‌కంగా పుష్క‌రాల్లో సెంట‌రాఫ్‌ ది ఎట్రాక్ష‌న్‌ గా నిలిచారు బాల‌య్య‌.

ఇక‌, పుష్క‌ర స్నానం అనంత‌రం బాల‌య్య స్థానిక ఎమ్మెల్సీ - విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జ్ బుద్ధా వెంక‌న్న‌ను వెంట‌బెట్టుకుని ఇంద్ర‌కీలాద్రి చేరుకున్నారు. అక్క‌డ కొలువైన క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాల‌య్య‌ మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నదిలో పుష్కర స్నానంతో పాప వినాశం జరుగుతుందని చెప్పారు. జిల్లా ప్ర‌జ‌లే కాకుండా అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లూ కృష్ణాన‌దిలో స్నానం చేసి త‌రించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇక‌, కృష్ణా జిల్లా బాల‌య్య సొంతం జిల్లా కావ‌డంతో కృష్ణాన‌దిని ఆయ‌నెంతగానో ఇష్ట‌ప‌డ‌తారని ఆయ‌న స‌న్నిహితులు పేర్కొంటున్నారు.