Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బయోపిక్ మళ్లీ జంప్?

By:  Tupaki Desk   |   29 Nov 2017 7:55 AM GMT
ఎన్టీఆర్ బయోపిక్ మళ్లీ జంప్?
X
గత కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన టాలీవుడ్ ని ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే వర్మ మొదలు పెట్టాడో  అప్పటి నుంచి బాలయ్య కూడా నాన్న గారి బయోపిక్ రెడీ అవుతోందని ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశాడు. ఎవరు ఊహించని విధంగా దర్శకుడిగా తేజ ను కూడా ఫైనల్ చేశారు. వర్మ సంగతి పక్కన పెడితే బాలకృష్ణ తీయబోయే బయోపిక్ ఎప్పుడు మొదలు పెడతారా అని అందరు చర్చించుకుంటున్నారు.

మొదట సినిమాను జనవరిలోనే మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఎన్నికల లోపు రిలీజ్ చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. కానీ ప్రస్తుతం బాలకృష్ణ పనులను పక్కనపెట్టేశారట. జనవరి 18న ఎన్టీఆర్ డెత్ ఆనివర్సరీ సందర్బంగా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ మరొక డేట్ ను అనుకున్నారట. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా మే 28న ఘనంగా స్టార్ట్ చేయాలనీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

దీంతో దర్శకుడు తేజ ఆ లోపు మరొక సినిమాను చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. గత కొంత కాలంగా వెంకీతో ఓ సినిమాను చేస్తాడని వస్తోన్న న్యూస్ గురించి తెలిసిందే. అయితే డిసెంబర్ లో వెంకీతో సినిమాను మొదలు పెట్టి తొందరగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇక తర్వాత తేజ పూర్తిగా ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆలోచిస్తాడని టాక్. ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తానే సొంతంగా నిర్మించనున్నాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.