Begin typing your search above and press return to search.
టాలీవుడ్ అగ్రహీరోకు కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 24 Jun 2022 1:12 PM GMTఅగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా చేసిన కోవిడ్ పరీక్షల్లో బాలకృష్ణకు పాజిటివ్ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ''తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా.
గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలి'' అని తెలియజేశారు బాలకృష్ణ.
ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది.
ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక బయట కార్యక్రమాల్లోనూ బాలయ్య విరివిగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్టు తెలిసింది.
టాలీవుడ్ లో ఇప్పటికే కరోనా చాలా మందికి సోకింది. పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్యకు కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతోంది. స్వల్ప లక్షణాలే ఉండడంతో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు.
బాలయ్యకు పాజిటివ్ అని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్య త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.