Begin typing your search above and press return to search.

వంద కోసం బాలయ్యపై ప్రెజర్

By:  Tupaki Desk   |   9 March 2016 1:40 PM GMT
వంద కోసం బాలయ్యపై ప్రెజర్
X
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమాపై ఇంకా సస్పెన్స్ తొలగలేదు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో.. గౌతమీ పుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక చిత్రం చేసేందుకు బాలయ్య రెడీ అయ్యారని అంటున్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ మూవీ విషయంలో బాలయ్యకు సలహాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా బాలయ్య వందో సినిమా తీయడమంటే ఏ నిర్మాతకైనా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాల్సిందే. అందుకే ఈ ల్యాండ్ మార్క్ మూవీని నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈ రేసులో ముందున్న వారిలో సాయి కొర్రపాటినే చెప్పాలి. బాలకృష్ణ వందో సినిమాని తామే నిర్మిస్తామని గతంలో కొన్ని సార్లు చెప్పారు కూడా. అయితే, ఇప్పుడు క్రిష్ మాత్రం తను డైరెక్ట్ చేసే సినిమాని తనే నిర్మిస్తానని అంటున్నాడు. దీనికి బాలయ్య కూడా సరే అన్నాడని తెలుస్తోంది. అయితే, క్రిష్ తో వందో సినిమా చేయడం కరెక్ట్ కాదని బాలయ్యకు కొందరు సన్నిహితులు ఇస్తున్నారట.

ఇప్పటివరకూ క్రిష్ ఒక కమర్షియల్ సక్సెస్ కూడా సాధించకపోవడం, మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోవడం వంటి పాయింట్లను బాలయ్య ముందు ఉంచుతున్నారట కొందరు సన్నిహితులు. దీంతో వందో సినిమా అనౌన్స్ మెంట్ విషయంలో బాలయ్య ఒత్తిడి ఫీలవుతున్నారని టాక్ వినిపిస్తోంది.