Begin typing your search above and press return to search.

బాలయ్య సెంచరీ.. వారం పోస్ట్ పోన్

By:  Tupaki Desk   |   19 March 2016 11:30 AM GMT
బాలయ్య సెంచరీ.. వారం పోస్ట్ పోన్
X
నందమూరి బాలకృష్ణ వందో సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించిన బాలయ్య.. ఇప్పుడో తుది నిర్ణయానికి వచ్చేశాడని అంటున్నారు. ఇక అనౌన్స్ మెంట్ ఒకటే లేట్ అని.. ఈ వారమే సెంచరీ సినిమా డీటైల్స్ ప్రకటించనున్నారనే వార్తలొచ్చాయి. అయితే.. తన ల్యాండ్ మార్క్ మూవీ విషయంలో బాలకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ విషయంలో ఎటువంటి మిస్టేక్ లేకుండా ఉండేందుకే ఇంత అలర్ట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య వచ్చే వారంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటైల్స్ ప్రకటించనున్నారు. బోయపాటి శ్రీను - సింగీతం శ్రీనివాసరావు - కృష్ణ వంశీ - అనిల్ రావిపూడి- క్రిష్ సహా.. పలువురు చెప్పిన సబ్జెక్టులను చాలా జాగ్రత్తగా పరిశీలించారు బాలయ్య. ఇప్పటికి ఉన్న టాక్ ప్రకారం అయితే.. క్రిష్ తో సినిమా చేసేందుకే బాలయ్య మొగ్గుతున్నారని అంటున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రాజెక్ట్ నే బాలకృష్ణ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయట.

సింగీతం చెప్పిన కాన్సెప్ట్ కూడా బాగా నచ్చినా.. దీన్ని 101వ సినిమాగా తెరకెక్కించేందుకు బాలయ్య నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇక మిగిలినవన్నీ అటకెక్కేసినట్లే చెప్పుకోవాలి. మొత్తానికి ఏ న్యూస్ కరెక్టో తెలియాలంటే మాత్రం మరో వారం ఆగాల్సిందే.