Begin typing your search above and press return to search.
అసలు బాలయ్య-బోయపాటి సినిమా ఉందా లేదా?
By: Tupaki Desk | 27 Dec 2019 9:20 AM GMTఅంత కంతకూ కుచించుకు పోతోంది. ట్రెండ్ కు తగ్గట్టు కథలు ఎంచుకోక పోవడం.. ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయక పోవడంతో ఆయన సినిమాల ను మెజారిటీ ప్రేక్షకులు తేలిగ్గా తీసుకోవడం మొదలు పెట్టారు.
బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఈ ఏడాది ఆరంభం లో దారుణ ఫలితం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 20 న విడుదలైన 'రూలర్' బాలయ్య ఇమేజ్ ను మరింతగా దెబ్బ తీసింది. కనీసం షేర్ తెచ్చుకో లేక రెండవ రోజుకే చతికిల పడింది. ఇది బాలయ్య కెరీర్ మరిచి పోదగ్గ చిత్రమని అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అంటే 'రూలర్' పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు బాలయ్య తదుపరి చిత్రం #NBK106 పై పడడం ఖాయమని చాలా రోజులు గా విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. నిజంగానే 'రూలర్' ఎఫెక్ట్ ఈ సినిమా పై పడిందని అంటున్నారు.
#NBK106 సినిమా ను రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారట. అయితే 'రూలర్' డిజాస్టర్ తర్వాత బాలయ్య మార్కెట్ పై సందేహాలు తలెత్తడం తో ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాత భావిస్తున్నారట. ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారని అంటున్నారు. బాలయ్యకు ఇది కాకపోతే ఇంకో సినిమా ఫిక్స్ అవుతుంది. కానీ బోయపాటి కి అలా కాదు. దీంతో బోయపాటి కి ఏం చేయా లో పాలు పోవడం లేదట. బోయపాటి లాస్ట్ సినిమా 'వినయ విధేయ రామ'.. అదో పెద్ద డిజాస్టర్. బాలయ్య సినిమా అతి కష్టం మీద ఫైనలైజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఆగితే బోయపాటికి నెక్స్ట్ సినిమాకు హీరో దొరకడం చాలా కష్టం. మరి ఏమవుతుందో వేచి చూడాలి.