Begin typing your search above and press return to search.

బాలయ్యా నిజం ఏంటయ్యా ?

By:  Tupaki Desk   |   26 May 2018 8:55 AM GMT
బాలయ్యా నిజం ఏంటయ్యా ?
X
ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఉండేలా పక్కా ప్లానింగ్ తో ఉండే బాలయ్య నాన్న బయోపిక్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఆర్భాటంగా షూటింగ్ మొదలుపెట్టాక దర్శకుడు తేజ తప్పుకోవడంతో మళ్ళి ఎవరు టేకప్ చేస్తారా అనే అయోమయం చాలా రోజులు నెలకొంది. దానికి తోడు బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తారని ఒకసారి, లేదు రాఘవేంద్ర రావు కానీ చంద్ర సిద్ధార్థ్ కానీ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని మరొకసారి రకరకాల వార్తలు వెలువడ్డాయి. ఏది నిజం అనేది మాత్రం బయటికి రాలేదు. తాజా సమాచారం మేరకు దీని పగ్గాలు గౌతమిపుత్ర శాతకర్ణిని అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్ చేతికే వెళ్ళబోతున్నాయట. ఎల్లుండి అంటే మే 28 స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ప్రకటిస్తారు అని కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అది ఆ రోజు తప్ప ముందే క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.

కానీ క్రిష్ మణికర్ణిక ఫినిషింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంతకు ముందు ఆగస్ట్ విడుదల అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు గ్రాఫిక్ వర్క్ చాలా బాలన్స్ ఉండిపోవడంతో ఏకంగా వచ్చే సంక్రాంతికి వెళ్లొచ్చు అనే టాక్ కూడా బాలీవుడ్ మీడియాలో ఉంది. దాని అప్ డేట్ కూడా అఫీషియల్ గా ఇవ్వడం లేదు. మరి ఈ నేపథ్యంలో క్రిష్ మూడు పడవల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకటి మణికర్ణికకు సంబంధించిన పనులు మరోపక్క ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు వరుణ్ తేజ్ హీరోగా తాను నిర్మాతగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తీస్తున్న సినిమా. ఇన్నేసి బాధ్యతలు మోయటం అంటే చిన్న విషయం కాదు. మరి క్రిష్ నిజంగా ఒప్పుకున్నాడా లేక ఫిలిం నగర్ సర్కిల్స్ లోనే ఆగిపోయే వార్తా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాంతో పాటు చంద్రబాబునాయుడు పాత్రలో రానా బసవతారకం గారి పాత్రలో నిత్యామీనన్ ఇప్పటికే ఎంపికైనట్టు సమాచారం. ఒకవేళ 28న ఏ ప్రకటన లేకపోతే ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టే. ఇదిలా ఉంటె వివి వినాయక్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించే సినిమా ప్రారంభోత్సవం కూడా జరగాల్సి ఉంది