Begin typing your search above and press return to search.
ఫైనల్ గా బాలయ్య చేతిలోకే..
By: Tupaki Desk | 27 April 2018 5:40 PM GMTప్రస్తుతం టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు చేసే యువ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా బాలయ్య తో పోలిస్తే వారు చాలా స్లో అనే చెప్పాలి. దర్శకులకు తగ్గట్టు పని చేయడంలో బాలకృష్ణకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఎలాంటి సినిమా అయినా సరే అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. గత కొంత కాలంగా ఆయన స్పీడ్ ఇంకా ఎక్కవ అవుతూనే ఉంది గాని ఏ మాత్రం తగ్గడం లేదు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ఎన్టీఆర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా హడావుడి తరువాత సినిమా షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది అనుకుంటున్న సమయంలో దర్శకుడు తేజ ఊహించని విధంగా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అటు తిరిగి ఇటు తిరిగి సినిమా దర్శకత్వ భారం బాలయ్య మీదే పడింది. మొదట్లో ఆయనే సినిమా తెరకెక్కిస్తున్నారు అని టాక్ వచ్చినప్పటికీ తేజ తెరపైకి వచ్చారు.
ఇక ఫైనల్ గా ఆయన తప్పుకోవడంతో ఫైనల్ గా బాలయ్య మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అనుభవజ్ఞులైన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా చిత్రాన్ని సొంతంగా నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా తన టాలెంట్ ను నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించాలని బాలయ్య ముందు నుంచి అనుకున్న మాటే. మరి ఈ ప్రాజెక్టును ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తారో చూడాలి.