Begin typing your search above and press return to search.
మహేష్ వాడిందే.. బాలయ్యా వాడాడు
By: Tupaki Desk | 4 Jan 2016 5:30 PM GMTరాజమౌళి సినిమాల పుణ్యమా అని.. హీరోలు వాడే ఆయుధాల విషయంలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది టాలీవుడ్లో. సింహాద్రి దగ్గర్నుంచి తన సినిమాల్లో హీరోకు ఓ ప్రత్యేకమైన ఆయుధాన్నివ్వడం రాజమౌళికి సెంటిమెంటుగా మారింది. ఆఖరుకు ఈగకు కూడా ఓ ఆయుధాన్నిచ్చిన ఘనుడు జక్కన్న. అతణ్ని చూసి మిగతా దర్శకులు కూడా హీరోల వెపన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇటీవలే మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాకు ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని చేతబట్టాడు.
పెద్ద రాడ్డు లాంటి ‘బోల్డ్’ వెపన్ తో సినిమా చివర్లో విలన్లను ఉతికారేశాడు. మహేస్ ఆ వెపన్ పట్టుకుని ఉన్న పోస్టర్లు జనాల్లో బాగా ఆసక్తి రేపాయి. ఐతే ఇప్పుడు సరిగ్గా అలాంటి ఆయుధాన్నే బాలయ్య వాడుతుండటం విశేషం. ‘డిక్టేటర్’ సినిమా కోసం బాలయ్య మహేష్ ఆయుధాన్నే పట్టాడు. డిట్టో ఆ బోల్డ్ రాడ్డునే బాలయ్య పట్టుకుని ఉన్న పోస్టర్లను రిలీజ్ చేశారు. అగ్ర హీరోల విషయంలో ఒకరిని ఒకరు అనుకరిస్తే అభిమానులు అస్సలు ఒప్పుకోరు. అయినా శ్రీవాస్ తన హీరోతో సేమ్ వెపన్ పట్టించేశాడు. మరి ఈ వెపన్ పట్టుకుని బాలయ్య ఏ స్థాయిలో వీరంగం సృష్టిస్తాడో చూడాలి. ‘డిక్టేటర్’ యాక్షన్ కు ఢోకా లేని సినిమా. ట్రైలర్ చూస్తేనే భారీ ఫైట్లు ఉంటాయని అర్థమవుతోంది.